పఠనీయం

లలితమైన జీవిత విశేషాల కబుర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోల్డన్ని కబుర్లు
-లలిత
పేజీలు: 384.. వెల: రూ.150
ప్రతులకు: అన్ని ప్రధాన
పుస్తకముల షాపులలో
లలితగారు తమ బ్లాగ్‌లో తమాషాగా రాసుకొన్న కబుర్లనే ఈ పుస్తక రూపంతో పాఠకుల ముందుకు తీసుకువచ్చారు. కల్పిత కవిత్వం కాకుండా, కేవలం తమ జీవనశైలిని చక్కగా పొందుపరిచారు. చదువరులకు అనేకానేక సందర్భాలలో చమత్కారములను చవిచూసే భాగ్యం కలుగుతుంది. ముఖ్యంగా మన దేశ సంస్కృతీ సంప్రదాయాల సంగీతం, పుస్తకం చివరి వరకూ నేపథ్య గీతంలా వినిపిస్తూనే ఉంటుంది. ఇది మామూలు విషయం కాదు. అన్ని విషయాలను, అన్ని విధాలుగా, గుర్తు పెట్టుకొని, వ్రాయడమనేది ఏ కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. నిజానికి కథలూ, నవలలకన్నా, కొందరి జీవిత చరిత్రలను చదివితే, ఎవరికి వారు తమ జీవితాల్ని ఎలా మలుచుకొంటే, జీవితం సఫలీకృతం అవుతుందో, అలా మలచుకొనే వీలున్నది. పాఠకులందరూ కూడా చాలామంది జీవిత చరిత్రలను చదవడానికి అలవాటుపడాలి.
ఇది ఆమె తొలి పుస్తకమే అయినా, అడుగడుగునా ఎంతో అనుభవం ఉట్టి పడుతూ ఉంటుంది. అందుకు కారణం ఆమెకు పుస్తకాలు బాగా చదివే అలవాటు ఉండడం. దానికి తోడు ఇంట్లో వాళ్లిచ్చిన అద్భుతమైన ప్రోత్సాహం. ‘కావేవీ నా రాతలకనర్హం’ అంటూనే అన్ని రకాల కబుర్లను రాశారు. ఆమె నెరిగిన అందరికీ ఆమె సంగతి బాగా తెలుసు. ఎవరికో నచ్చాలనీ, ఎవరో మెచ్చాలని వ్రాసే అలవాటు లేదు. తను నమ్మి చేసేదే రాసేది. రాసేదే చేసేది. నిజాయితీగా నిజాలే రాస్తుంది - అంటూ ముందు మాట రాసిన లక్ష్మీసాయిగిరిధర్ తెలియజేశారు. ఈ పుస్తకం చదివిన ఎవరికైనా అలానే అనిపిస్తుంది. హాస్యరసాన్ని కురిపిస్తూ, తన బోలెడన్ని కబుర్లతో ఇంద్రధనస్సునే సృష్టిస్తుంది. చదివించని గురువులంటే ఎవరా వాళ్లు అనిపిస్తుంది. వాళ్లెవరో కాదు ఇంట్లోని పెద్దవాళ్లే. ముఖ్యంగా ఈవిడగారి నాన్నమ్మ మడికట్టుకొని, పదింటికల్లా, వంకాయ కారం పెట్టి కూర, కొబ్బరిపచ్చడి, అరటికాయ కూర, ఆనపకాయ సాంబారు ఇలా రోజూ అంత వంట చేదట, ఇది చదువుతుంటే నాకు నోరూరి వంటింట్లోకి వెళ్లి, అప్పటికి పూర్తయిన వంటకాల్ని కొన్ని నోట్లో వేసుకొని వచ్చా. ఇలాంటి నోరూరించే, మనసును పరవశింపచేసే, ఆనాటి మడీ ఆచారాలను గురించి, మనసు విప్పి మాట్లాడే మనుషుల గురించి, లలితగారు చాలా లలిత లలితంగా రాశారు. ఈ పుస్తకం చదివిన ఎవరికైనా, వెనకటి రోజులు ఎంత హాయిగా గడిచేవో అనిపిస్తుంది. కేవలం కాలక్షేపం కోసమే కాకుండా, అనేక మంచిమంచి విషయాల్ని తెలుసుకోవాలనుకునే వారికి ఒక గైడ్‌లా ఉపయోగపడుతుంది. ఈ పుస్తకాన్ని ముఖ్యంగా పిల్లల చేత చదివించడం, లేదా చదివి వారికి వినిపించడం ఈ కాలంలో ఎంతైనా అవసరం. ఎందుకంటే ఆనాటి కట్టుబాట్లు, పండుగలూ పబ్బాలూ, రకరకాల చిరుతిళ్లు అన్నీ పుష్కలంగా ఈ పుస్తకంలో దొరుకుతాయి. వీరు ఇంకా ఇంకా సరదా కబుర్లతో ఎప్పుడూ పాఠక లోకానికి కనిపిస్తూనే వుండాలని, ఈ పుస్తకం చదివిన ఎవరికైనా అనిపిస్తుంది.

-షణ్ముఖశ్రీ 8897853339