పఠనీయం

విభాకరుని వెలుగులో వికసించిన కథాపద్మం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథాపద్మిని (కథాసంకలనం)
-డా.పుట్టపర్తి నాగపద్మిని
వెల: రూ.75
ప్రతులకు: ఎన్.సి.హర్షవర్థన్
37, ఈస్ట్ ఆనంద్‌బాగ్
హైదరాబాద్-47.
మరియు ప్రముఖ
పుస్తక కేంద్రాలు

‘జీవితమే ఒక పెద్ద నాటకరంగం’ అని నమ్మే డా.శ్రీమతి పుట్టపర్తి నాగపద్మిని గారికి తాను ఎదుర్కొన్న ప్రతి అంశమూ కథానుకూలమే! అందుకే వారు స్వానుభవాల్లోంచి ఈ కథలను సృష్టించారు. అందుకే ఈ సంకలనం (కథాపద్మిని)లోని తొమ్మిది కథలు చాలా సహజంగా ఉన్నాయి. ఈ కథల్లోని సంఘటనలతో పాఠకులు తమ అనుభవాలను పోల్చి చూసుకుంటే ‘నిజమే సుమా!’ అని అనిపించకమానదు. ఎటొచ్చీ - నాగపద్మిని గారు అనుభవాలను యథాతథంగా కాగితం మీదకి దించకుండా, ఎత్తుగడ, నడక తీరు, పాత్ర పోషణ, ముగింపు - వీటిపైన ప్రత్యేక శ్రద్ధ కనబరిచి వీటి పఠనీయత పెంచారు. హిందీ, తెలుగు - రెంటిలోనూ ఎం.ఏ. చేసిన ఈ రచయిత్రికి సాహిత్య విలువలు, ప్రత్యేకతలు బాగా తెలుసు.
ఇటు దక్షిణాది మలయాళం తెలుసు; అటు ఉత్తరాన ఉన్న గాంగ్టక్, డార్జిలింగ్‌లు, ఉత్తరాన ఉన్న లక్నోలోని భూల్ భులయ్యా తెలుసును; నీలాంబరీ రాగ కీర్తనలు (గాల్లో తేలినట్లుందే..) తెలుసును. అందుకే ఎంచుకున్న విషయాన్ని అలవోకగా చెప్పేస్తూ, సున్నితమైన హాస్యం - ‘మసాజ్ సెంటర్’ (పే.2) సదియా (పే.5), సత్యలో ఒలికిస్తారు. ఇంతేకాదు - అదేదో టీవీ అడ్వర్టయిజ్‌మెంట్‌ని రూపాంతరీకం చేసి ‘వలపు మంచిదే. సరైన మలుపులుంటే’ (పే.10) అంటారు. 3 పూవులు 6 కాయల్ని మూడు ఫోన్లూ, ఆరు స్కైపులని (పే.44) అంటారు. మూడుకి మీ దూరానికి వంద రూపాయలు అడిగే ఆటోవాలాకు, చేరవలసిన చోటుకు చేరి 23 రూపాయల మీటర్ ఛార్జికి 25 రూపాయలిచ్చి సంతోషపెడతారు (గాల్లో తేలినట్టుందే..) అదీ ఇదీ కొనమంటూ ఫోన్లలోని వేధింపు కాల్స్‌కు బుద్ధి వచ్చేట్టు చేస్తారు (మాటకచ్చేరి). చుక్కల ముగ్గు అంటే (బహుశా) ఇష్టపడే ఈ రచయిత్రికి ‘చుక్కల’ లెక్కలు తెలుసు. జీవితమనే చుక్కల ముగ్గు సవ్యంగా వేయగలగటమూ తెలుసు. చుక్కల ముగ్గులో జీవిత తత్వాన్ని దర్శించటమూ తెలుసును. 9 కథలతోపాటు జీవితంలో మనం ఎదుర్కొనే వివిధ సంఘటనలు, సమస్యలు, వాటిని మనం చూసే తీరు గురించి హాస్య స్ఫోరకంగా ‘సుబ్బారావు విజయ మాత్రలు’ పేరున ఒక దినపత్రికలో ప్రచురించబడి ప్రశంసలందుకున్న 26 చిన్నచిన్న ఖండికలూ (స్కిట్స్) ఇచ్చారు ఈ సంకలనంలో. కథలన్నింటా, అంతర్లీనంగా సాగే హాస్యస్ఫూర్తికి, ఆత్మీయతకు, కథావర్ణనలోని నర్మగర్భతకు, ఇతర భాషల్ని తెలుసుకోవాలన్న రచయిత్రి ఉత్సుకతకు పాఠకుడు ‘్ఫదా’ అవుతాడు.

-కూర చిదంబరం 8639338675