పఠనీయం

కొండపల్లి వారి కవితా ప్రపంచం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇహం - పరం
కవితా సంపుటి
రచన: కొంపల్లి వేంకట కోటిలింగం
వెల:రూ.70/- ప్రతులకు:
వివిధ ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
*
ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుకు తూర్పున ఆకులల్లూరు అనే సముద్ర సమీప గ్రామం ఉంది. ఇక్కడ కొండపల్లి వంశస్థులు ఎన్నో వందల సంవత్సరాలుగా జీవించినట్లు చారిత్రకాధారాలు లభించాయి. ఏనుగుల వీరాస్వామి రచించిన కాశీయాత్ర ప్రాచీన గ్రంథం. అందులో ఈ గ్రామ ప్రసక్తి ఉంది. అలాగే ఆకులల్లూరులోని గ్రామాధికారి రామిరెడ్డిగారు రచించిన ‘ఒంగోలు రాజుల చరిత్ర’ అనే జంగం (బుర్ర)కథలో కూడా కొంపల్లి వెంకటప్పయ్య అనే మంత్రసిద్ధుని ప్రసక్తి వుంది.
1940 ప్రాంతంలో కొంపల్లి అంజయ్య సుందరమ్మ దంపతులకు కొంపల్లి జ్వాలయారాధ్యులు జన్మించారు. ఈయన జీవితంలో అధిక భాగం ఒంగోలులో గడిచింది. వీరి శైవదీక్ష, మంత్రశాస్త్ర పారీయణత ఆనాటి అవిభక్త గుంటూరు జిల్లాలో సుప్రసిద్దమే. ప్రస్తుతం గరివిడి (విజయనగరం జిల్లా) కావలి (నెల్లూరు జిల్లా) హైదరాబాదులలో నివసిస్తున్నారు.
‘ఇహం-పరం’ అనే కవితా సంపుటిని రచించిన కొంపల్లి వేంకట కోటిలింగం వీరి పెద్ద కుమారుడు. కెవికె కావలిలోని జవహర్ భారతిలో లెక్చరర్‌గా పనిచేసి అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. వేదుల సత్యనారాయణ శాస్ర్తీ, శ్రీరాం వేంకట భుజంగరాయశర్మ, ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీ వంటి దేశికుల సాహచర్యంతో కెవికెకు సాహిత్య తృష్ణ కలిగింది. ఐతే వృత్తి రాజకీయ శాస్త్రోపన్యాసకత్వం కావటంతో కలాన్ని కవితపై సంధించలేదు. కాకుంటే సందర్భోచితంగా అపుడపుడు అడపా తడపా ఒక గేయమో ఒక తేటగీతి పద్యమో వ్రాసి ఆయా సభలలో అనవసర నైవేద్యాలుగా సమర్పించబడిన రచనలన్నీ కలిపి వారి కుమారుడు కొంపల్లి హరిబాబు (సుందర్) ఒక సంకలనంగా తీసుకొని వచ్చాడు. ఈ గ్రంథం పేరే ఇహం -పరం. దీని అర్థం ఏమిటంటే ప్రథమ భాగంలో లౌకికమైన విషయాలకు సంబంధించిన పద్యాలున్నాయి. ద్వితీయ భాగంలో దేవతా స్తుతులున్నాయి. కొంపల్లి వేంకట కోటిలింగం తండ్రి జ్వాలయారాధ్యులు 1960వ దశకంలో శివభక్తి కీర్తనలు అనే చిన్న గ్రంథాన్ని ప్రచురించారు. దానిని ఒంగోలులోని భక్తబృందాల వారు నిత్యం పాడుకుంటూ ఉండేవారు. కోటిలింగం గారిది శ్రౌత శైవ ఆరాధ్య సంప్రదాయం. ఈ కారణం చేత వీరి రచనలు శివభక్తి ప్రధానంగా సాగాయి.
ఈ గ్రంథానికి ఎస్.రమేష్ (అమ్మ నుడి సంపాదకులు), శ్రీ మాడభూషి శ్రీ్ధర్ (కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్) తిలకం దిద్దారు. ‘‘మన దేశంలో ప్రచారానికి అవార్డులకు ఆశపడకుండా అట్టహాసాలకు (అట్ట అంటే పుస్తకాల అట్ట హాసాల డాంబికం కూడా ఎక్కువే) అంగలార్చకుండా కేవలం తమ ఆత్మసంతృప్తికోసం కవితలు వ్రాసుకొని ఆత్మానందం పొందే కవులు రచయితలు ఎంతోమంది ఉన్నారంటే నమ్మనివారికి సజీవ సాక్ష్యం చైతన్యపూరితమైన ఉదాహరణ, అక్షరసత్యం కొంపల్లి వేంకట కోటిలింగంగారు. ఆయనే ఒక చైతన్య గంగాధర అంటారు శ్రీ్ధర్‌జీ.
కొంపల్లి జ్వాలయారాధ్యుడు బహు కుటుంబీకుడు. ఆరుగురు ఆడపిల్లలు నలుగురు మగ పిల్లలు. మగ పిల్లలంతా ఆయా రంగాలల్లో రాణించారు. కళాకారునిగా చిత్రరచయితగా గౌరీశంకర్ సుప్రసిద్ధుడు. విశిష్ట వైద్యునిగా సోమసుందర్ ఉన్నత శిఖరాలనందుకున్నాడు. శైవ సిద్ధాంత గ్రంథాలను శివకుమార్ అచ్చువేయించాడు. అధ్యాపకునిగా స్నేహశీలిగా విశ్వోదయ నిర్మాతలలో ఒకడై కోటిలింగం కావలిలో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. అందుకే ఈ కవితా సంపుటి నెల్లూరు జిల్లా కావలిలోని అసంఖ్యాక సంఘటనలు వ్యక్తులు దర్శనమిస్తారు.
‘రంభ-రాయి’ అనే ఈ లఘు కవిత చూడండి.
తే.గీ: కార్యభారమందు గంటలు గడువంగ / కడుపులోని గాసు కదలసాగె / ఏమి దొరుకలేదు ఎందు శోధించినా / రంభ వెంటపడిరి రాయివారు-
ఈ పద్యానికి తాత్పర్యం ఏమిటంటే, విశ్వోదయంలో రాయిరత్న జోసఫ్ అనే ఆంగ్లోపన్యాసకుడున్నారు. పని వత్తిడితో ఆయన చాలాసేపు తరగతి గదిలోనే ఉండిపోయాడు. దానితో ఆకలి అయింది. స్ట్ఫారూంకు వచ్చేసరికి తినడానికి ఏమీ దొరుకలేదు. అక్కడ ఒక అరటిపండు కన్పడింది. దానిని భుజించి క్షుద్బాధ తీర్చుకున్నారు. ఇక్కడ రాయి అంటే వ్యక్తి నామం (ప్రాపర్ నౌన్), రంభ అంటే అరటిపండు. ఇదీ చమత్కృతి.
ఆకాశవాణిలో సమస్యా పూరణాలు వస్తుంటాయి. శ్రీ కోటిలింగంగారు పూరించిన ఈ సమస్య చూడండి.
‘అరయగ మోక్షమె సంపద / సిరులన్నియు సిరులుగావస చిక్కులె తలపన్ / ధరలో వీనిని తెలుసున్ దారిద్య్రము కోరి యొకడు ధనవతి అయ్యెన్’- సమస్యలోని వైరుధ్యాన్ని చాలా చక్కగా పూరణం చేశారు.
‘పునశ్చరణ’ అనే ఖండిక ప్రభోదాత్మకం. ‘నూరునూతుల సమమగు నొక్క బావి’- ఈ పద్యం మనకు భారతము ఆదిపర్వంలోని శకుంతలా ప్రబోధం గుర్తుకుతెస్తున్నది. (నుత జల పూరతంబులగు నూతులు నూరిటికంటె)
‘‘కలిమి నిలువదు- ఒకచోట / కదులుచుండు / రాజ బంటగు బంటును / రాజు అగును/ గర్వపడకుము చంచల/ కాసు చూచి / వినయమొక్కటె నమ్ముము / విజయపథము’’
‘‘చుట్టము యాత్రకు జనతతి/ చుట్టము రోగికి వైద్యుడు / చుట్టము సత్కర్మ మృతున కుర్వీస్థలిలో’’
ఇందులో సర్వధర్మములలోను సత్కర్మాచరణమే మోక్షదాయకం అనే గీతాసారం ప్రతిపాదింపబడింది.
‘‘పుట్టునాడు నీవె, పూడికనాడీవె మధ్య వచ్చి కలియు మనుజులెవరు? వారు వీరు మధ్య వరదలోకలిసెడు/ తృణపుతృణపు ఋణము / తృణము కనగ’’
వరదలో రెండు కట్టెలు ఒకదానితో ఒకటి కలిసి మళ్లీ ప్రవాహ వేగంలో దూరం కావటం ఇందలి సారాంశం. జీవితంలో బాంధవ్యాలు ఇలాంటివే అని తాత్విక బోధ.
అలెగ్జాండరు విశ్వవిజేత - ఐతే తన రెండు చేతులూ బయట పెట్టి పాతేయండి అని కోరాడట. ఎందుకంటే పోయినపుడు తాను ఏమీ తీసుకొనిపోవటంలేదని ప్రపంచానికి చాటాలని.
ఈ నీతి మన నాయకులు వినాయకులూ నేర్చుకొంటే ఇన్ని సంక్షోభాలు ఉండవు కదా!
‘తికము’ అనే శీర్షికలో ఈ పద్యం చూడండి
‘త్రికమునందు నీవు తృప్తిని చెందుము. ధార- భోజనంబు - ధనమునందు త్రికమునందు నీవు తృప్తిని చెందకు జ్ఞాన తపములందు దానమందు’’ ఇది ఉపనిషత్ సందేశమే.
‘తృప్తింజెందని మనుజుడు సప్తద్వీపంబులందు చిక్కంబడునే’ అని చిన్నప్పుడు మనకు గురువులు నేర్పిన పద్యం గుర్తుచేసుకోవాలి.
కోటిలింగంగారిలో హస్య కుశలత కూడా ఉంది. అది క్వాచిత్కంగా బయటపడింది. శ్రీశ్రీ గురించి ఓ కవిత వ్రాస్తూ ‘శ్రీనాథునికి శ్రీశ్రీకి సీసాలపైననే ధ్యాస’ అన్నారు.
శంకరాచార్యుల భజగోవింద స్తోత్రానికి పద్యానువాదం ఉంది. రావణతర్కం అనేది ఒక పౌరాణిక భావవీచిక. ఇలా ఎనె్నన్నో ....

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్