పఠనీయం

అస్తిత్వ దుస్థితి వివరించే కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసు కోతి వంటిది
కథా సంకలనం,
రచన: పాలపర్తి జ్యోతిష్మతి,
వెల: రూ.150/-
ప్రతులకు: రచయిత్రి,
32-103, వాసవీనగర్,
అద్దంకి - 523201
*
ఈ అనంత విశ్వంలో ప్రతీ వక్తికి క్షణక్షణానికీ వేల వేల సంఘటనలు తారసపడుతుంటాయి. వాటన్నింటికీ ఆలోచనా పరులు మాత్రమే స్పందిస్తారు. అలా స్పందించిన ప్రతీ వ్యక్తీ కథలు, కవితలు అల్లరు. కవులు, రచయితలు మాత్రమే తమ స్పందనకు ప్రతిస్పందనగా కథలు రాస్తారు. కవితలల్లుతారు. పాఠకుల మనసులను తాకగల్గుతారు.
భిన్న సామాజిక సమస్యలపైన దృష్టి సారించి ఆ సమస్యలకు కథారూపమిచ్చిన ఒక ఆవేదనపరురాలి అంతరంగం ఈ కథలు. శ్రీమతి పాలపర్తి జ్యోతిగారు దశాబ్దంన్నర నుండే కథలల్లుతున్నారు. ఇది వారి రెండవ కథ సంకలనం.
ఇందులో 38 కథలున్నాయి. ఇవన్నీ, ‘ఏదో ఒకటి రాసెయ్యాలి’ అం టూ హడావిడిగా రాసిన కథలు కావు. వస్తువు, ఇతివృత్తం, శైలి, శిల్పం. వీటన్నింటి మీద స్పష్టమైన అవగాహనతో రాసినవి. ఈ రచయితకి మరో సుగుణం ఉంది. చెప్పదలుచుకున్న విషయాన్ని, ‘శషభిష’తో డొంకతిరుగుడుగా, పేజీలు నింపుతూ పోకుండా సూటిగా మనసుకు నాటేట్లుగా చెబుతారు. అందుకే వీరి ఈ కథల్లో కొన్ని 2 లేదా 3 పేజీలకు మించవు. మరో విశేషం సంకలనంలోని కథల్లో సింహభాగం, పలు ప్రముఖ పత్రికలలో ప్రచురించబడి ప్రజాదరణ పొందినవే కావటం గమనార్హం. భౌతికపరమైన మార్పులతో, మనిషి మారుతాడా? అవునని అనాల్సి వస్తుంది. వీరి ‘‘వయసు - మనసు’’ కథ చదివాక పసివాడు సుబ్బుకి అమ్మేలోకం, వయసు వస్తూంటే, వాడికి స్నేహితులు వస్తారు, భార్య, పిల్లలుంటారు. అమ్మ అవసరం ‘పలుచ’ బడుతుంది. చివరకి సుబ్బు కూడా ముసలాడయిపోతాడు. కథ పునరావృతం అవుతుంది. చిన్న చిన్న వాక్యాలతో అతిప్రతిభావంతంగా చిత్రించబడిన కథ ఇది.
ఇదే పంథాలోనే ‘‘విధి విలాపం’’ అనే కథ నడుస్తుంది. ‘‘మనిషి పడుతోన్న పాట్లు చూసి జంతువులు పొర్లిపొర్లి నవ్వాయట, నేడు చోటు చేసుకుంటోన్న సాంకేతికాభివృద్ధి మీద రచయిత్రి ఎక్కుపెట్టిన ఈ వ్యంగాస్త్రం పాఠకులను ఆలోచింపజేస్తుంది. చేస్తున్న కర్మలను బట్టి వ్యాధులొస్తున్నాయని, ఒకనాటి కర్మణ్యేవాథికారస్తే, నేడు వ్యాధి కారకాలు అంటారు రచయిత్రి.
నేటి కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులను ‘‘పంజరంలోని పక్షుల్లా మారుస్తున్నాయని, ఇటు సంస్థలు, అటు తల్లిదండ్రుల మధ్య విద్యార్థులు బలైపోతున్నారంటూ, తల్లిదండ్రుల ప్రేమకు కరువైన విద్యార్థులు, అమ్మా నాన్నల్ని చూడాలని అలమటించిపోవటం, ‘ఔటింగ్ సండే’, ‘విజిటింగ్ సండే’ లాంటి రోజుల్లో హాస్టల్ విద్యార్థులకుండే తల్లిదండ్రుల మీది తపన ‘‘మిస్స్‌డ్ కాల్’’లో వివరించారు. కార్పోరేట్ విద్యాలయాల హాస్టల్‌లో ఉంచుతున్న తల్లిదండ్రులు చాలా ‘సీరియస్’గా ఆలోచించాల్సిన సమస్య ఇది.
అతి సహజంగా పాఠకుడిని సున్నితంగా ఆత్మవిమర్శ చేసుకొనమనే కథ.మచ్చుకి పై నాలుగు కథలు గురించి రాసినా, పాలపర్తి జ్యోతిష్యం గారి కథలన్నీ, మానవ సంబంధాలకు అద్దం పడుతూ, ఆలోచింపజేస్తాయి.పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇవాక్‌గారు తన ‘ముందుమాటలో అన్నట్లు ‘‘మానవ జీవిత బహు పార్ష్వాలను పరిశుద్ధంగా పరిశీలించి ప్రకటించిన కథలు. మనసున్న పాఠకుడిని ఆలోచింప జేసే కథలు. కథా నిర్మాణం, ఎత్తుగడ, నిర్వహణ, ముగింపులు అద్భుతంగా చెప్పబడిన కథలు. రచయతలు మనుష్యులను చూసి వారి భవితవ్యాన్ని ఆలోచించి కథారూపంలో భావిని చూపిస్తారు. అవి చదివిన పాఠకుడు తన్ను తాను మార్చుకుంటూ భావిని బంగారమయం చేసుకొనే నేర్పునుకలిగి ఉంటే రచయత ఆశించిన ఆశయం నెరవేరుతుంది. ఆలోచింపచేసే సత్తా ఉన్న ఈ సకంలనం రచయత ఆశ నెరవేరేట్టు చేస్తుందనుకొందాం. *

-కూర చిదంబరం ఫోన్: 8639338675