పఠనీయం

ఆశ పుట్టించే కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కొరివి’’
కథా సంకలనం;
రచన: వల్లూరు శివప్రసాద్;
వెల: రూ.100/-,
కాపీలకు:
విశాలాంధ్ర నవచేతన మరియు నవోదయా బుక్‌హౌస్‌వారి బ్రాంచీలు
మరియు
WWW.anandbooks.com
*
జార్జి శాండర్స్ అనే ప్రఖ్యాత కథారచయిత కథ గురించి ఇలా అంటాడు. ‘‘ఏదైనా ఒక కథ చదివినప్పుడు, పాఠకులలో కొంత కొత్త తెలివిడి, ప్రపంచంపై కొంత ప్రేమకలగాలి’’. ఆయనే మళ్ళీ ఇలా అంటాడు. ‘‘కొంతలో కొంతైనా ప్రపంచం పట్ల ప్రేమ పెరగాలి’’. ఆయనే కాదు, మనం అందరం కోరుకునేది అదే! జీవితాలను యథాతథంగా చూపుతూ, క్రొత్త ఎరికలని తెలియజేస్తూ, మనం ప్రస్తుతం ఉన్న స్థితినుంచి మరికొంత ఎత్తుకు తీసుకువెళ్ళగలిగేదే మంచి సాహిత్యం.
పాఠకులను తన్మయపరుస్తూ, వెంట తీసుకెళ్తూ, కథ చదివి పుస్తకం మూసినాక కూడా, ఆ కథ తాలూకు ఆలోచనలు పాఠకుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ, ఒక విధమైన ‘ట్రాన్స్’లోకి లాక్కెళ్ళగలగాలి.
రాశి కంటే వాసి ఎక్కువ పొందగల కథకుడు వలూ లరు శివప్రసాద్‌గారు టైమ్‌పాస్ కథలు రాయరు. రాసిన ప్రతి కథలోనూ, తాత్త్వికత, సమాజం యెడ సానుభూతి, తోటి వారిమీద ప్రేమ వ్యక్తం అవుతుంది. భార్యను పోగొట్టుకున్న భర్త రమణ అరవయికి దగ్గర పడుతున్న వయసులో మళ్ళీ పెళ్ళిచేసుకుంటాడు.
అదీను పనె్నండేళ్ళ వయసున్న కొడుకుగల తల్లిని! ‘ఈ వయసులో అవసరమా’ అని అందరూ ఆక్షేపిస్తారు. అవును: అవసరమే... రమణకు కాదు; భర్తను పోగొట్టుకుని, ఆశ్రయానికి అలమటిస్తున్న కోటేశ్వరమ్మకు! ఇంటర్ అయిపోయి, ఎమ్‌సెట్‌కి ప్రిపేర్ అవుతోన్న అబ్బాయి సతీష్‌కు. వారిద్దరి బ్రతుకులు బజార్నపడకుండా ఉండటానికి. అందుకే రమణ ఆంతర్యం, ఆయన పిల్లలకు అర్ధంకాకున్నా, రమణ స్నేహితుడు శేషుకి అర్ధం అయింది. కథ చదువుతోన్న పాఠకులకు అర్ధం అవుతుంది (ఆదరువు- కథ). డెబ్బయి ఏళ్ళ తులసమ్మ పల్లెటూర్లో పుట్టి పెరిగింది. అబ్బాయి రాజేష్ ఉద్యోగరీత్యా నగరంలో స్థిరపడుతాడు. ఒంటరి తులసమ్మను రాజేష్ పట్నంలో ‘అంటుకట్టా’లని ప్రయత్నిస్తాడు. అనుక్షణం బిక్కుమంటూ బ్రతికాల్సి వస్తుందామెకు. కొరియర్ అబ్బాయి వస్తే తలుపుతీస్తే ఏమవుతుందో భయం. తీయకపోతే ఏమవుతుందో భయం. కొడుకూ కోడలు పరస్పరం అరుచుకున్నా ఆమెకు భయం. పల్లె, పట్నపు జీవితాల్ని గొప్పగా ‘ఎనలైజ్’చేసి, తులసమ్మ లాంటి వారు పట్నంలో ఎందుకు శాంతంగా బ్రతకలేకపోతారో చెప్పిన కథ ‘‘శాంతము లేక...’’. అలాంటిదే మరో కథ ‘‘మెట్లకూ, మెట్లకూ మధ్య...’’
జయంతి అక్క శేఖర్ బావలకు వరుణ్ రేణులు సంతానం. ఇంట్లోను, స్కూల్లోనూ, నాలుగు గోడలు, నాలుగు అంతస్థులు. గాలీ వెలుతురు చొరబడని జీవితాలు. తల్లితండ్రులు పిల్లలకు కావల్సింది ఇవ్వాలి. కాని వారు కోరుకునేది ఇస్తే, స్వేచ్ఛా వాయువులు ఇష్టపడే వరుణ్ లాంటి పిల్లలు ‘‘న్యూరోటిక్’’ సమస్యలకు గురిఅవుతారు. పిల్లలపై వత్తిడి తగదని చెప్పేకథ ఇది.
మానసిక విశే్లషణ చేస్తూ రాసిన గొప్ప కథ.
అమరావతి రాజధానిపై ఈ మధ్య ఎన్నో కథలు వచ్చాయి. ఆరుగాలం శ్రమించే రైతుకు నోట్ల కట్టల మీంచి వచ్చే గాలులు పీల్చాల్సి అగత్యం వస్తే, అర్ధాంతరంగా వచ్చిపడ్డ డబ్బు, భార్యాభర్తల మధ్య, తండ్రీ కొడుకులమధ్య, అన్నా చెల్లెలు మధ్య చిచ్చు రగిలిస్తే, కూర్మయ్య లాంటి అమాయక జీవులు అసువులు బాయటం తప్ప గత్యంతరం లేదని చెప్పే కథ: ‘‘మిత్తవ’’. జీవితం అంటే కార్లు, నోట్ల దొంతరలు, మద్యం సీసాలు కావని జీవితం అంటే సుఖము, శాంతితో బ్రతకటం అని చెబుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధాని ఖరారైన తర్వాత, అక్కడి సన్నకారు, చిన్న రైతుల కుటుంబాలలో ఎంతటి చిచ్చు రగిలిందో చాలా గొప్పగా చెప్పారు రచయిత.
మచ్చుకి పేర్కొన్న పై కథలే కాదు, సంకలనంలోని కథలన్నీ మనిషికి మనిషికి మధ్య ప్రేమ, అనురాగాల్ని వివరిస్తాయి. ఆక్సెజన్‌లా వాటి అవసరం మనుగడకు ఎంత ముఖ్యమో చెబుతాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం నేలకు కాళ్ళాన్చి ఉండటం అవసరం అని చెబుతారుూ కథలు. జార్జి శాండర్స్ కథా నిర్వచనానికి సరిగ్గా సరిపోయే కథలు.

- కూర చిదంబరం