పఠనీయం

భారతీయ తత్త్వంలోనే వసుధైక కుటుంబం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రహస్య లిపి (చారిత్రక నవలా సంపుటి)
ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్‌
ప్రాప్తి స్థానం: 2-2-647-132 బి.
సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ
హైదరాబాద్: 500013.
ఫోన్: 040-27425668
మూల్యం: రూ.300
*
చారిత్రక నవలా రచన చేయడం ఒక యాగం. ఆ రచన చదవడం ఒక యోగం అని తత్త్వ వివేచకుల ఉవాచ. శివయోగి, వేద విజ్ఞానఖని, చారిత్రక నవలా చక్రవర్తి బిరుదాంకితులు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారు. ఇదివరి 111వ గ్రంథము. ఇందులో చారిత్రక నవలలు సుప్రసిద్ధమైనవి. నాగనీల్, శ్రీలేఖ, వసంతగౌతమి, శ్రావణి, ఆచార్య నాగార్జున, శ్రీపదార్చన, మాలిక్‌కాఫర్, ఆవాహన, చంద్రకళ. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క కళాఖండం. హిందీలో బృందావన్‌లాల్ వర్మ, గురుదత్ వైద్య, రాహుల్ సాంకృత్యాయన్. ఆంగ్లంలో చార్లెస్ డికెన్స్, విక్టర్ హ్యూగోవండావారు అత్యంత ఖ్యాతి గడించారు. తెలుగు చారిత్రక సభామంటపానికి నాలుగు స్తంభాలు. విశ్వనాథ, నోరి, బాపిరాజు ఇప్పటి మన ముదిగొండ వారు. ఇది ఈ శతాబ్దంలోని ఏకగ్రీవాభిప్రాయం. విశ్వనాథ వారిలోని బౌద్ధత్వం, నోరి వారిలోని చారిత్రక ప్రామాణ్యం, బాపిరాజుగారి లాలిత్యం మూడు శివప్రసాద్‌గారి రచనలో త్రివేణీసంగమంలా పరిణమించాయి. మన స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చుకోవడం కోసం చారిత్రక నవలలు రాస్తున్నాను. చరిత్ర తెలియని వాడు చరిత్ర హీనుడవుతాడు అని ముదిగొండ వారు ఒక సందర్భంలో ఉటంకించిన మాటలను మనం గుర్తుంచుకోవాలి.
ఈ గ్రంథంలో రెండు చారిత్రక నవలలు, ఒక సాంఘిక నవలిక ఉన్నాయి.
మొదటిది మేడమ్ బ్లావిట్‌స్కీ జీవితం ఆధారంగా రచించబడినది ‘రహస్య లిపి’. హెలీనాపెట్రోనా బ్లావిట్‌స్కీ 1831 జూలై 31న రష్యాలో పుట్టి క్రైస్తవ మత పద్ధతిలో ఆర్థడాక్స్ చర్చిలో బాప్టిజం పొంది చివరికి బౌద్ధమతాన్ని స్వీకరించినది. బ్లావిట్‌స్కీ పుట్టినప్పటి నుంచీ స్వతఃసిద్ధంగా వచ్చిన కొన్ని అతీంద్రశక్తుల వలన పరలోక ఆత్మలతో సంభాషించారు. జరుగబోయే సంఘటనలను తెలియజేస్తూ ఒక సిద్ధ పురుషుణిగా పేరు సంపాదించుకున్నది. ఆమె ధియోసాఫికర్ సొసైటీని స్థాపించింది. నిజమైన ఆథ్యాత్మికత్వం అంటే మానవుణ్ని దేవునిగా మార్చడం అని ప్రచారం చేశారు. ఈ సంస్థ కార్యాలయం ప్రస్తుతం చెన్నైలోని అడయార్‌లో కూడా ఉన్నది. 1884లో బ్లావిట్‌స్కీ ఇండియాను దర్శించుకొని ఇక్కడ వేదాలలోని కృణ్వంతో విశ్వమాధ్యమ్. ‘‘ఏకం సత్ విప్రాః బహుదావదన్తి’’ శంనో మిత్రః శం వరుణః అనే వేల సంవత్సరాల నాటి హిందూ ధర్మం సర్వశ్రేష్టమని ప్రపంచంలోని బౌద్ధంతో సహా అన్ని మతాలకు హిందూధర్మం వటవృక్షం లాంటిదని తెలియజేశారు. బ్లావిట్‌స్కీ శిష్యురాలు అనిబిసెంట్ సేవలు భారత స్వాతంత్య్రోద్యమంలో చిరస్మరణీయమైనవి. 1873లో చికాగోలోని సర్వమత సమావేశాలలో స్వామివివేకానందగారు ప్రవచించినది. ప్రస్తుత కాలంలో పద్మశ్రీ పురస్కారానికి ఎన్నిక కాబడిన బ్రెజిల్ దేశస్థురాలు గ్లోరియా అరేరియాగారి ఆచరణ సిద్ధాంతాలు భారతదేశంలోని వేదాలను, ఉపనిషత్తులను ద్వైతాలను, అద్వైతాలు ప్రపంచ దేశాలకు మార్గదర్శకమైనవి, సర్వజనావళి క్షేమకరమైనవి అని ప్రబోధించి ఆచరించి చూపించడం బ్లావిట్‌స్కీ గారి గొప్పతనానికి తార్కాణం. మాండకోప నిషత్తులోని సత్యమేవ జయతే అనే మంత్రానికి నో రెలీజియన్ ఈజ్ హయ్యర్ దాన్ ట్రూత్ అనే దివ్య జ్ఞాన లోగోలో ఉన్నది అక్షర సత్యం. ఒక్క మాటలో చెప్పాలంటే భారతీయ తత్వంలోనే వసుధైక కుటుంబం అనే లక్ష్యాన్ని సాధించవచ్చును.
మేడమ్ బ్లావిట్‌స్కీ గారు రాసిన ‘ది సీక్రెట్ డాక్ట్రిన్’ అనే గ్రంథాన్ని ఆధారంగా కొన్ని సమకాలీన చారిత్రక అంశాలను పొందుపరచి శ్రీ ముదిగొండ శివప్రసాద్‌గారు రచించిన ‘రహస్య లిపి’ చదవడం నిజంగా పాఠకులకు మహా యోగమే.
రెండవ చారిత్రక నవల రోహణయ్
కథాకాలమ్ 1880. అది భారతదేశపు సంధి యుగం. ప్రాచీన జీవనమూల్యాలు పూర్తిగా అంతరించలేదు. అలాగని ఆధునిక భావాలు ఇంకా భారతదేశంలో అవతరించలేదు. ఈ రోహణము అనే నవల పోలవరం రాజుగారైన కొచ్చెర్లకోట రామచంద్ర వెంకటకృష్ణారావు బహద్దర్‌గారి సంస్థానం నేపథ్యంలో రచించినది. రోహణము అంటే పైకి ఎక్కుట. రోహిణి అనే పదహారు సంవత్సరాల అమామ్యి తమ పొలం వద్ద ఉన్న ఎతె్తైన మంచెమీదకు ఎక్కి వడిసిలరాయి విసురుతూ పిట్టలను తరుముతూ పంటలను రక్షిస్తూ ఉంటుంది. చైత్ర శుద్ధ పాడ్యమితో ప్రారంభమై నవమి వరకు జరిగే తొమ్మిది దినాల ఉత్సవాన్ని వసంత నవరాత్రము అంటారు. రాజావారి అనారోగ్య కారణంగా ఆ ఉత్సవాలు వాయిదా పడతాయి. తమ తమ విద్యలను ప్రదర్శించి రాజావారి నుంచి బహుమతులు, ఈనాములు పొందాలని వచ్చిన కళాకారుల బృందాలు కవిపండితుల సమూహాలు నిరాశ చెంది రాజావారి సంస్థానం పొలిమేరలలోనే మకాం వేస్తారు. అక్కడే ఉబుసుపోక తమ వంశపారంపర్య విద్యలను అద్భుతంగా ప్రదర్శిస్తారు. ఇక్కడే ముదిగొండ వారు తమ కలానికి పదునుపెట్టి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలలోని వివిధ ప్రక్రియలను అన్నిటినీ పాఠకులకు ఎరుక కలిగించారు. యక్షగానాలు మొదలుకొని తోలుబొమ్మలాటలు, హరికథలు, ఇంద్రజాలికుల ప్రదర్శనలు, పగటి వేషగాళ్ల, జానపద గాయకులు వివిధ కళారూపాలు ఘనాపాటిగారి వేదాంత ఘోష, భక్తిగీతాలు, జావళీలు, భరతనాట్యం, దేవదాసీల నృత్యాలు, వైద్యరీతులను, బహువిధములైన సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోతున్న నేటి తరానికి పునరావృతం చేశారు. రాజావారి కుమారులు చినరాజావారు మారు వేషంలో ఈ ప్రదర్శనలు అన్నింటినీ తిలకించి బహుమతి ప్రదానం చేయడం మల్లేశ్వరి సినిమాను కొంతవరకు పోలి ఉండటం యాదృచ్ఛికమే అవుతుంది. మొత్తం మీద ఈ నవల ఆనాటి సంస్థానాధీశుల కళాపోషణ. అప్పటి సమాజ పరిస్థితులను కూలంకషంగా అధ్యయనం చేయటానికి ఎంతో ఉపయోగపడుతుంది.
మూడవది సాంఘిక నవలిక విశ్వనాథ్‌గోడ్బోలే
వాహిబ్ అబ్దుల్లా అనే పాకిస్తాన్ గూఢచారి భారతదేశంలోకి ప్రవేశించి విశ్వనాథ్ గోడ్బలేగా పేరు మార్చుకొని హిందూస్ర్తిని వివాహం చేసుకొని శివభక్తునిగా వేషం వేసి పాకిస్తాన్‌కు ఇక్కడి రహస్యాలు పంపిస్తుంటాడు. కొంతకాలానికి ఆ దేశంలోని కొంత మంది మహాపురుషుల సాంగత్యంతో భారతదేశం సంస్కృతి, సంప్రదాయాల విలువలు తెలుసుకొని మనసు మార్చుకొని అసలైన హిందువుగా మారిపోతాడు. ఇక రెండవ వాడు అజయ్ అలియాస్ కర్తార్‌సింగ్ దేశద్రోహిగా మారి తల్లిచేతిలో మరణిస్తాడు. ఎవరు నిజమైన భారతీయుడు? జన్మసిద్ధమా లేక కర్మసిద్ధమా? అనే ప్రశ్నను పాఠకులను ఆలోచింపచేసేదిగా ఉంది. ముదిగొండ వారు ఇనె్వస్టిగేషన్ జర్నలిజంలో అందె వేసిన చెయ్యి. అందుకే తన సునిసితమైన దృష్టికి వచ్చిన దేశంలో జరుగుతున్న కుళ్లు రాజకీయాలను, నయవంచక మత మోసాలను విపులంగా సోదాహరణంగా చర్చించి పాఠకులను చైతన్యవంతుల్ని చేశారు. తన 80వ సంవత్సరంలో కూడా వయోభారంతో బాధపడుతున్నా ఎంతో ఓర్పుతో, పట్టుదలతో భావితరాలకు మార్గదర్శకంగా ఉండే విధంగా ఈ రహస్యలిపి అనే చారిత్రక, సాంఘిక నవలాసంపుటి రాసి తాను ధన్యుడై కన్నతల్లిదండ్రుల మాతృభూమి రుణం తీర్చుకున్నారు.
ఇంతటి గొప్ప గ్రంథాన్ని వదాన్యులు శ్రేయం, మోహన గుప్త, శ్రీమతి మల్లీశ్వరి పుణ్యదంపతులకు (ఏలూరు) అంకితం ఇవ్వడం బంగారానికి తావి అద్దినట్లు ఉన్నది.

-‘జనశ్రీ’ 7995900497