పఠనీయం

వర్తమానానికి దోవచూపే జీవితచరిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శకపురుషుడు
బ్రహ్మశ్రీ కొండపల్లి జ్వాలయారాధ్యుల
వారి జీవిత చరిత్ర
రచయిత: కొంపల్లి శివకుమార్
ప్రతులకు: సంప్రదించవలసినవారు
040-27420203
*
చరిత్ర తెలియనివారు చరిత్రహీనులవుతారు. మన పూర్వీకులు ఎవరు వారి రూపురేఖలు ఏమిటి, ఏ విధమైన జీవన విధానాన్ని అనుసరించారు. వారి యొక్క గొప్పతనాలు, వారు పడ్డ కష్టాలు, చేసిన లోపాలు అన్నింటిని మనం తెలుసుకొని సక్రమమైన నడవడికను అలవరచుకొని మనం ప్రయోజకులమై, సమాజానికి ఉపయోగపడి రాబోయే తరాలవారికి ఆదర్శంగా నిలవాలి. అప్పుడే మన పుట్టుకకు సార్థకత. మన జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఋణం తీర్చుకొన్నవారము అవుతారు. కొంపల్లి శివకుమార్‌గారు ఎన్నో వ్యయ ప్రయాసలకు గురై, పరిశోధనలు చేసి వారి వంశ శకపురుషుడు పేరు ప్రఖ్యాతులు సంపాదించిన శ్రీ కొంపల్లి జ్వాలయారాధ్యులవారి (1898-1968) చరిత్రను కూలంకషంగా గ్రంథ రూపమునకు తెచ్చారు. అంగుష్ఠమాత్ర పరిమాణం నుంచి ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ఈ విరాట్ పురుషుని జీవిత చరిత్ర నిజంగా వీరి వంశస్థులకే కాకుండా నేటి యువతరానికి ఒక గొప్ప ఆదర్శంగా నిలుస్తుంది.
ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక అద్భుత సంఘటన జరిగి దాని పర్యవసానంగా ఆ మనిషి వ్యక్తిత్వం ప్రభావితమై తద్వారా ఆ మనిషి గొప్పవాడై తనకు తన కుటుంబానికి సంఘానికి, దేశానికి ఎంతో ఖ్యాతి సంపాదించిన ఎన్నో సందర్భాలు చరిత్రలో మనకు కనపడుతున్నాయి. దక్షిణాఫ్రికాలో జరిగిన ఒక సంఘటనవలన ఒక సాధారణ మానవుణ్ణి ఒక మహాత్ముడిగా, మన జాతిపితగా చేసిన విషయం మన అందరకు తెలిసినదే. అదే కోవలో జరిగిన ఒక పరాభవ సంఘటన జ్వాలాయారాధ్యులవారి జీవితంలో గొప్ప మార్పునకు నాంది పలకడం. అల్లర చిల్లరగా చిన్నప్పుడు తిరిగినవారు ఎంతో శ్రద్ధతో పట్టుదలతో చదువుకొని కృష్ణయజుర్వేదము, అంత్యేష్టి, శైవప్రతిష్ఠలు, శివరాధనా ప్రక్రియలలో ఉద్దండులుగా మారి తన తండ్రిగారి వంశ గౌరవ ప్రతిష్ఠలను తిరిగి పొందటం. పండితుల ప్రశంసలు పొందడం నిజంగా గొప్ప విషయం. తరువాత కాలంలో వారు యజ్ఞాలు, యగాలు చెయ్యడం, జ్యోతిశాస్తమ్రులో పట్టు సంపాదించడం, భూత, ప్రేత పిశాచాది ఈతిబాధలు పడేవారికి ఉపశమనం కలిగించడం జ్వాలాయారాధ్యులవారి మంత్ర, తంత్ర, యోగ, ధ్యాన ప్రతిభలకు నిదర్శనం.
సంసార జీవితాన్ని సాగిస్తూ, ఋషితుల్యునిగా తన జీవనాన్ని గడుపుతూ సమాజ సేవే తన జీవిత ధ్యేయంగా భావించి ఒక శైవ పీఠాధిపతిగా, ఒక శకపురుషునిగా వెలుగొందిన జ్వాలాయారాధ్యుల చరిత్ర అందరికీ దీప స్తంభంలాంటిది.
ముఖ్యంగా ఇలాంటి రచనలు చెయ్యాలి అంటే ఆనాటి సామాజిక పరిస్థితులపట్ల అవగాహన, పరిజ్ఞానము పుష్కలంగా ఉండాలి. ఈ గ్రంథములో దాదాపు 150 సం.ల క్రిందట ఆచార వ్యవహారాలు, భార్యాభర్తల అనుబంధాలు, ధర్మం, న్యాయం, ప్రభుభక్తి, కుటుంబ బాధ్యతలు, నీతి నియమాలు, కట్టుబాట్లు, త్యాగనిరతి లాంటి విషయాలు రచయిత పాఠకుల ముందు పొందుపరచారు. వీరిలో తనకు తెలిసిన విషయాలు గ్రంథస్తం చేసి రాబోయే తరాలకు అందించాలి అనే ఆర్తి, స్ఫూర్తి నిండుగా ఉన్నాయి. విస్తృతాధ్యయనం, విశే్లషణ చెయ్యగల సామర్థ్యం వీరిలో కొట్టవచ్చినట్లు కనపడుతున్నది.
ఎన్నో ఆసక్తి గల విషయాలు ఈ గ్రంథంలో రచయిత ఉటంకించారు. చారిత్రక నవలా చక్రవర్తి ముదిగొండ శివప్రసాద్‌గారి తల్లిగారు శ్రీమతి రాజేశ్వరమ్మ గారు విధివంచిత. తన ఒక్కగానొక్క కొడుకు 2 సంవత్సరాల వయస్సులో తన భర్త మల్లికార్జునరావుగారు కలరా వ్యాధి సోకి శివైక్యం కావడం.
ఆ తరువాత ఆమె ఒక్కతే కుమారుని బాగోగులు చూస్తూ తండ్రి లేని లోటు లేకుండా శివప్రసాద్‌గారిని బాగా చదివించి నేటి సాహితీ లోకానికి మరొక చారిత్రక నవలా దిగ్గజాన్ని అందించడం ఆ భగవంతుని లీలా విలాసమే కదా. ఈ విధమైన అద్భుత సంఘటనలు మనకు తెలియనివి ఎన్నో ఈ గ్రంథంలో ఉన్నాయి. నేటితరం యువకులు ఈ గ్రంథాన్ని చదివి తమ జీవితాలను ఒక ఉన్నతమైన ఆశయ సాధనకు ప్రయత్నించి మంచి పౌరులుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారని మనసా, వాచా కర్మణా విశ్వసిస్తున్నాను.

-జనశ్రీ 7995900497