పఠనీయం
సామాజిక స్పృహ కలిగించే సంకలనం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నేస్తం - నవల
రచన పొన్నూరి సత్యనారాయణ
కలంపేరు: బంటిరామ్ పొన్నూరి
వెల: రూ. 120/-లు
ప్రతులకు
పి. సత్యనారాయణ
సెల్:- 9948616628
*
‘‘నేస్తం’’ నవల రచయిత శ్రీ పొన్నూరి సత్యనారాయణ,వీరి కలం పేరు బంటీరామ్ పొన్నూరి. సామాజిక స్పృస ఉన్నవారు ప్రకృతే సర్వస్వం అని నమ్మి చెట్టు పుట్టా, చీమ చిలుకలతోసహా ప్రకృతి జీవులన్నింటినీ పలుకరిస్తారు. ప్రతీ సామాజిక సమస్యకు తనదైనశైలిలో స్పందిస్తారు.
నేడు జనం ఎదుర్కొంటున్న పర్యావరణ కాలుష్యం, పరువు హత్యలు 150 సంవత్సరాల క్రిందట వచ్చిన పారిశ్రామిక విప్లవం , అది తెచ్చిన పెట్టిన ఉపద్రవం. నమామి గంగే , వెలుగుల ఎన్.ఇ.డి బల్బుల కాంతి కాలుష్యం, సారీథీన్ వాడకం, ఓజోన్ పొర కరిగిపోవడం- వీటన్నింటితో భూమికి మరియు భూమీద నివసిస్తోన్న చెట్టూ చేమా, జంతు జాలము, పక్షులు , మానవులు ఎలావిధ్వంసం దిశగా అడుగులేస్తూన్నారో చెబుతారు. ఇంతేకాదు. వీరు జన్మ నక్షత్రాలు కర్మఫలాలు జాతకాల్లంటివి నిరసిస్తూ ఈ నమ్మకాల్లోని డొల్లతనాన్ని ఎండగట్టుతారు.
సేద్యం, నక్సలిజం, ఇప్పటి చదువులు, ఇంగ్లీషు మీది వ్యామోహం ల మాతృభాషకు కలుగుతోన్న ముప్పు, ఎడిసన్ శాస్తవ్రేత్త , సంక్రాంతి పండుగ సంబరాల్లో కోళ్లు ఎలాబలి అవుతున్నావో .. వివరంగా చెబుతారు.
నేస్తాన్ని బంటీరామ్ గారు ‘నవల’ అన్నారు. కానీ ఈ పుస్తకం అంతా రచయిత ఆవేదన, వెర్రితలలు వేస్తోన్న నేటి సంస్కృతి పై తన విల్లంబులు ఎక్కుపెట్టారు. ప్రథమ పురుషలో నడిచినీ నవలకు కథానాయిక మాధవి. మాధవి అక్కరాధ. వీరిద్దరూ కవలలు. వీరికి అన్నా వదినలు, వారి చిన్న పాప గాయత్రి,.కథానాయకుడు ‘శ్యామసుందరుడు’ విజయవాడ దగ్గరి రామాపురం అనే గ్రామం, విజయవాడ అన్నిటింటినీ సందర్భానుసారంగా వస్తువులుగా చేసుకొని, తన సందేశం విశ్వకళ్యాణానికి పాటించాల్సిన నియమాలు వివరంగా ఇచ్చారు. నవల ముగిసాక ఆరువ్యాస్యాల్లో చరవాణి, ఊరేగింపులు, రోడ్డుమీద అడుక్కునే వెండి రంగు పూసుకున్న బాలగాంధీ, పాకీపని వారి పారిశుద్ధ కార్యక్రమంలోని జుగుప్స , వివరించారు. సాదాసీదాగా నడిచే ఈ నవలల్లోని పాత్రలుపాఠకుడికి ఇచ్చే సందేశాలు ఆరు వ్యాసాలు , వ్యాసాల్లోని వ్యక్తులు- వీటన్నింటినీ పాఠకుడికి విసుగు పుట్టించకుండా వివరించారు.