పఠనీయం
అలరించే పల్లె కథలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ముగ్గురాళ్ళ మిట్ట కథల సంపుటి
రచన- ఆర్.సి.కృష్ణస్వామి రాజు
వెల:రూ.100/-
ప్రతులకు: రచయిత,
9393662821
*
కథకులు ఏ ప్రాంతంవారైతే ఆ ప్రాంతపు భాష, యాసలు బాగా ఆకళింపు చేసుకుని ఉండటంవల్ల వారు ఆ శైలిలో బాగా రాయగలుగుతారు. ‘ముగ్గురాళ్ళ మిట్ట’ కథల సంపుటి సంకలనకర్త ఆర్.సి.కృష్ణస్వామి రాజు చిత్తూరు జిల్లా పుత్తూరు వాసి. బాల్యాన్ని బాగా ప్రేమిస్తారు. ‘ఈ కథల్లోని ముడిసరుకు తన బాల్యం అని, ప్రత్యక్షంగానో పరోక్షంగానో, అనుభూతించిన వాస్తవాలకు ప్రతిరూపాలు ఈ కథలు’ అని చెప్పుకున్నారు. అందుకే సంకలనంలోని 16 కథలు అత్యంత సహజంగా ఉన్నాయి. కథల్లో వాడిన భాష కూడా ఆ జిల్లాకు చెందినదే ఎన్నుకున్నారు, కనుక కథలన్నీ అతిగా సానపెట్టని వజ్రాల్లా ప్రకాశిస్తున్నాయి. పైగా కథలన్నీ లోగడ పలు పత్రికల్లో ప్రచురించబడి మెప్పులందుకున్నవే! పాప ప్రమీల నెత్తకుప్పం పరీక్ష హాలుకు వెళ్లాలి. రోజూ వెళ్ళే ఆటో రెండు టైర్లు పంక్చరయ్యయి. ‘ఎలారా!’ అంటూ ఏడుస్తా వుంది. కంపచెట్లు నరికే పరదేశన్న, అంగడి సుగుణ, గచ్చకాయలు ఆడుతోన్న జలజ, వనజ, ఊటుకూరు వాణి, మీసాలాయన కొడుకు జ్యోతిరాజు, మూగనోము మునిలక్ష్మి, కువైట్ కిష్టడి పెళ్లాం పరమేశ్వరి, సిల్వర్ సత్యం, సెంగలక్క- అందరూ టెన్షన్ పడతారు. చివరకు ప్రెసిడెంట్ సిబ్యాల సుధక్క, తన పాతిక లక్షల ఇన్నోవా కారులో ప్రమీల పరీక్ష రాయటానికి వెళ్ళగలుగుతుంది. ప్రమీలకు వచ్చిన కష్టానికి ఊరు ఊరంతా ఏకమై ఆదుకోవటానికి సిద్ధపడ్డారు ముగ్గురాళ్ళ మిట్ట కథలో.
అంకాలమ్మ కొలువుకి అందరితో బాటు, ఆ ఊరి ఉప్పు తిని ప్రయోజకులైన ఐదుగురు డాక్టర్లూ వచ్చారు. వైద్య సహాయం లేని ఆ ఊరికి ఐదుగురు డాక్టర్లు తమ సేవలందిస్తామని వాగ్దానం చేస్తారు. ఊరంతా సంబరపడుతుంది ‘ఊరి ఉప్పు’ కథలో.
వన్యప్రాణుల్ని చంపటం నేరం. కాని అడవి పందులు పంటల్ని పాడుచేస్తున్నాయి. వాటిని చంపకూడదు. పంటల్ని సంరక్షించుకోవాలి. ఎలా? చదువుకున్న రామతులసి ఓ తరుణోపాయాన్ని సూచించింది. అంతే- అడవి పందులు వచ్చిన దారి పట్టాయి ‘అడవి పంది’ కథలో. రామతులసి చదూకుంది. కనుక తరుణోపాయాన్ని చెప్పి, అటు పంటల్ని, ఇటు అడవి పందుల్ని రక్షించింది. ఇలాంటి కథలే మరి పదమూడు సంకలనంలో ఉన్నాయి.
రాజుగారి తనదైన భాష, ప్రాసలతో మనుషుల పేర్లు (పలకలు కొట్టే పాండు, బైరాగి భద్రయ్య, ఇడియప్పం ఇసిందారన్న) ధారాళంగా వాడిన సామెతలు (ఇచ్చేవాడుంటే చచ్చినవాడు కూడా లేస్తాడు, పిల్లి మింగిన కోడి పిలిచినా పలకదు, నాకే లేదు నాకుడు బెల్లం; నీకెక్కడినుండి తెచ్చేది గోకుడు బెల్లం, ఎవరి తలనొప్పికి వాళ్ళే మాత్ర వేసుకోవాలి పొడుపులు పే.41, మరియు 87) బజ్జీల్లో రకాలు, నమస్కారాల్లో వివిధ రకాలు (పే.68) లాంటివి, పాఠకుడికి ఉల్లాసం కలుగజేస్తూ ముందుకు నడిపిస్తాయి.