పఠనీయం

తెలంగాణ జన జీవన ప్రతిఫలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాలిన పూలు
(నవల)
రచన: ఐతా చంద్రయ్య,
వెల:రూ.110/-,
కాపీలకు: రచయిత,
సిద్ధిపేట, ఫోన్:9391205299,
మరియు నవచేతన పబ్లిక్ హౌస్.
*
*తెలంగాణ ప్రాంతపు ప్రముఖ నేటి తరం రచయితల్లో ఐతా చంద్రయ్యగారికో ప్రముఖ స్థానముంది. నిన్నటి తరానికి నేటి తరానికి వారథియై, అటు సాంప్రదాయ, ఇటు నవనీత- రెంటికీ సమన్యాయం చేకూర్చుతూ రెండు తరాల పాఠకులను అలరిస్తున్నారు. నవలలు, కవితా సంపుటాలు కథా సంపుటాలు అనువాదాలు వెరసి- శతాధిక సంకలనాలతో తెలుగు సాహితీమతల్లిని అలంకరించారు. ప్రపంచాన్ని పరికించు, స్థానికతకు ప్రాధాన్యమివ్వు (్థంక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ) అన్న సూక్తి వీరి యెడ సరిగ్గా సరిపోతుంది.
జాతీయ కళలు, సంపదలు, వృత్తి నిపుణత, ప్రపంచీకరణవల్ల మరుగునపడుతోన్నాయి. సాలె, కమ్మరి, కుమ్మరి- లాంటి వృత్తి జీవితాలు ఆనాడు తమ ఉత్పత్తులను డబ్బు కొరకు కాకుండా, సమాజావసరాలకు పనికివచ్చేవిగా పరిగణించేవారు. పరస్పరాధారిత గ్రామ ప్రజలు గొప్ప ఆత్మగౌరవంతో బ్రతికేవారు. చంద్రయ్యగారి ఈ నవలలో బాలయ్య పద్మశాలి. చక్కని నైపుణ్యం తన నేతలో చూపుతూ కళాత్మకమైన ‘ఊర్వశి’ చీరలను నేసేవాడు. మారుతోన్న కాలంతో సమంగా పరుగెత్తలేక, రోజు కూలీగా చతికిలబడి మద్యపానానికి బానిసవుతాడు. భార్య బాలవ్వ బీడీలు చుడుతూ, సంసారాన్ని లాక్కువస్తుంటుంది. వీరికి నిజంగా ఊర్వశి లాంటి చక్కని కూతురు. తండ్రీ తల్లి మరణంతో ఊళ్ళో మరే ఆధారం లేక, ప్రభాకర శర్మ అనే యువకుడి వలలో చిక్కుకుంటుంది. అభం శుభం ఎరుగని అమాయక ఊర్వశి ‘రాలిన పూవై’ హోటళ్లలో అశ్లీల నృత్యాలతో పొట్టపోసుకుంటుంది. ఒకనాడు ఆ హోటల్‌పై రెయిడ్ జరిగి ఊర్వశితో సహా సిబ్బందిని అరెస్టు చేస్తారు.
ఏసిపి గోపిది మరో విషాదకరమైన కథ. తల్లి మల్లవ్వది గడీ దొరల మధ్య బ్రతుకు. అక్క విజయదీ అంతే! అదృష్టవశాత్తు గోపీ గడీకి దూరంగా పెరిగి తన చదువు, చురుకుదనంతో పోలీసు ఉద్యోగం సంపాదించుకుంటాడు. ఊర్వశి, గోపీలు ఇద్దరివీ నేల రాలిన బ్రతుకులే! గోపీ అదృష్టంవల్ల సముచిత స్థానాన్ని సంపాదించుకోగలుగుతాడు. ఊర్వశి విధి వంచితురాలవుతుంది. గోపీ మంచితనం, మానవత్వంవల్ల గోపీ ఊర్వశీలు దంపతులవటంతో నవల ముగుస్తుంది.
కధ కంటే కథనానికి, వస్తువుకంటే శిల్పానికి ప్రాముఖ్యత ఇవ్వబడిన ఈ నవలలో తెలంగాణ సామెతలు, వాడుక పదాలు, సందర్భాన్ని బట్టి సహజత్వాన్ని చేకూర్చాయి. ‘అయ్యల్ల’ (పే.45). దీనికి సమానార్థం అయ్యో. గ్రాంథిక పదం అహో, ఇశిరె పోరడు (పే.58) బ్యాగరి (తక్కువ కులాల శవాల్నెత్తేవాడు, (పే.61) లాంటివి. పోలీసు స్టేషన్ వాతావరణం (పే.89, 90) పాఠకుడికి కళ్ళకు కడుతుంది. రచయితకు ప్రీతిపాత్రమైన సూర్యోదయ వర్ణన, ఆ వర్ణనలో పరిసరాలు ప్రతిఫలింపచేయటం చాలా సందర్భాల్లో చదవగలుగుతాము.
గొర్రెలు బలిస్తే గొల్లోనికే నయం (పే.56), పుణ్యం పుట్టెడు పురుగులు తట్టెడు (పే.91) లాంటి సామెతలు రచయితకు భాషమీదున్న పట్టు తెలియజేస్తుంది. 2018 తెలంగాణ సాహిత్య అకాడమీ నవలల పోటీలో బహుమతి పొందిన నవల ఇది. పాఠకులకు గొప్ప సందేశాన్ని ఇస్తుంది.

-కూర చిదంబరం