జాతీయ వార్తలు

కాల్పుల మోతతో నిద్రలేచిన పఠాన్‌కోట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పఠాన్‌కోట్, జనవరి 2: పఠాన్‌కోట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ సమీపంలోని ధకీ ప్రాంతవాసులకు శనివారం కాల్పుల మోతతో తెల్లవారింది. పాకిస్తాన్‌కు చెందినవారుగా అనుమానిస్తున్న ఉగ్రవాదులు పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడికి తెగబడటంతో అక్కడి స్థానికులంతా ఉలిక్కిపడి నిద్రలేచారు. ఈ దాడి సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల్లో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతిచెందగా, నలుగురు ముష్కరులు హతమయ్యారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను గాలించేందుకు వైమానిక దళం హెలికాప్టర్లను రంగంలోకి దింపడంతో వాటి శబ్ధం కూడా స్థానికులను అప్రమత్తం చేసింది. తెల్లవారగానే పెద్దపెద్ద శబ్ధాలు వినిపించడంతో ఏమి జరుగుతోందో తెలుసుకునేందుకు మెట్లెక్కి ఇంటిపైకి వెళ్లిన తనకు భీకరమైన కాల్పుల శబ్ధాలు వినిపించాయని దినేష్ శర్మ అనే స్థానికుడు తెలిపాడు. అతని ఇల్లు పఠాన్‌కోట్ వైమానిక స్థావరానికి దాదాపు 800 మీటర్ల దూరంలో ఉంది. ఎస్పీని కిడ్నాప్ చేశారన్న వార్త నేపథ్యంలో శుక్రవారం నుంచి ఈ ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను మోహరిస్తుండటంతో తీవ్రవాద దాడి జరిగిందన్న అనుమానం కలిగిందని, దీంతో తామంతా అప్రమత్తమయ్యామని దినేష్ శర్మ టెలిఫోన్ ద్వారా పిటిఐ వార్తా సంస్థకు వివరించాడు. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్న హెలికాప్టర్లు శుక్రవారం రాత్రంతా తమ ఇళ్లపై చక్కర్లు కొట్టాయని, దీంతో తాజా వార్తలను తెలుసుకునేందుకు తామంతా టెలివిజన్ల ముందే కూర్చున్నామని అతను చెప్పాడు. శనివారం ఉదయం కూడా కాల్పుల శబ్ధాలు వినిపించాయని ధకీ ఏరియాలో నివసిస్తున్న సుర్జిత్ సింగ్ అనే మరో వ్యక్తి తెలిపాడు. (చిత్రం) పఠాన్‌కోట్ ఎయర్‌బేస్ పరిసరాల్లో గుమికూడిన స్థానికులు