జాతీయ వార్తలు

ఆశా వర్కర్లకు నెలకు రూ. 15 వేలు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభలో టిఆర్‌ఎస్ ఎంపీ పాటిల్ డిమాండ్
న్యూఢిల్లీ, డిసెంబర్ 17: ఆశా వర్కర్ల సేవలను క్రమబద్ధం చేయడంతోపాటు, కనీస వేతనాలను నిర్ణయించాలని టిఆర్‌ఎస్ ఎంపీ బిబి పాటిల్ డిమాండ్ చేశారు. పాటిల్ గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైద్య పథకాలను గ్రామ స్థాయిలో అమలు చేసే ఆశా వర్కర్ల సేవలను క్రమబద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆశా వర్కర్లకు ప్రస్తుతం నెలకు 1500 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని, ఇది ఏమేరకు సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. ఆశా వర్కర్లను ఆగ్జిలరీ నర్సులుగా గుర్తించాలన్నారు. వారికి ఆరోగ్య కార్డులు జారీ చేయటంతోపాటు బీమా సౌకర్యం కల్పించడంతో పాటు నెలకు 15వేల రూపాయల వేతనం చెల్లించాలన్నారు.
తెలంగాణకు హోదా ఇవ్వాలి
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని లోక్‌సభలో టిఆర్‌ఎస్ పక్షం నాయకుడు జితేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. జితేందర్ రెడ్డి గురువారం లోక్‌సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైకాపా నాయకుడు వైవి సుబ్బారెడ్డి చేసిన డిమాండ్‌ను ఆయన సమర్ధించారు.అయితే తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు.