సబ్ ఫీచర్

సహకార వ్యవస్థకు పితామహుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు పట్ట్భా సీతారామయ్య జయంతి
=======================
డాక్టర్ భోగరాజు పట్ట్భా సీతారామయ్య జయంతిని ఈ సంవత్సరం భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర దేశంలో సహకార రంగ వ్యవస్థ ఆవిర్భవించిన శతజయంతిగా నిర్వహించటం అభినందనీయం. తెలుగునాట సహకార రంగ వ్యవస్థాపక పితామహుడాయన. ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, కోపరేటివ్ వ్యవస్థలను మొట్టమొదటిసారిగా తెలుగువారికి పరిచయం చేసిన వాడు పట్ట్భాసీతారామయ్య. ఆయన భారతదేశ స్వాతంత్య్రోద్యమ తొలితరం నాయకులలో ఒకరు. స్వాతంత్య్రోద్యమ నాయకులెవరూ పట్ట్భా సీతారామయ్య రాసి ప్రచురించిన గ్రంథా లు రాయలేదు. ఆయన రెండు సంపుటాలలో అఖిల భారత కాంగ్రెస్ చరిత్ర రాశారు. సుమారు పది సంవత్సరాలు వివిధ సందర్భాలు కలిపి జైల్లో ఉన్నారు. జైలులో ఉండగా కాంగ్రెసు సంస్థ స్థాపన స్వర్ణోత్సవం వచ్చింది (1885-1935) అప్పుడాయనకు భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర రాయాలన్న కోరిక కలిగింది. రెండు నెలల వ్యవధిలో 1600 వందల పుటల కాంగ్రెస్ చరిత్రనాయన రాశారు. అప్పుడాయనకు సంప్రదింపు గ్రంథాలేవీ లేవు. నిజానికి తెల్ల కాగితాలు కూడా లేవు. దినపత్రికల అంచుల ఖాళీ ప్రదేశాలలో, తనకు వచ్చిన ఉత్తరాలు, అవి కవరు లైతే వాటిని చించి ఆ ఖాళీ ప్రదేశాలలోనూ, జైలుతాఖీదులు, వైద్య సంబంధ నివేదికలు మొదలైనవి ఒక వైపు ఖాళీగా ఉంటే వాటితో నూతన సంకల్పాన్ని నెరవేర్చుకున్నాడు. దీని కోసం ఆయన ప్రతిఫలంగా చిల్లిగవ్వకూడా తీసుకోలేదు. అంతేకాక పది రూపాయలిచ్చి నాలుగు ప్రతులు కొనుక్కున్నానని కూడా ఆయన స్వీయ జీవితానుభవాలలో ప్రస్తావించారు.
జాతీయ విద్యను గూర్చి, భారత జాతీయ స్వరూప స్వభావలను గూర్చి, స్వదేశ సంస్థానాలు -్భరతదేశ సమాఖ్య, ప్రపంచ రాజ్యాంగం, బ్రిటిషు సామ్రాజ్యపు భారతదేశపు అంతులేని దోపిడి, గాంధీతత్వం భూమిక - సోషలిజం (సమసమాజ దర్శనం) గూర్చీ, 60 ఏళ్ళ కాంగ్రెస్, భారతదేశ రాజకీయాల వౌలిక సమస్యలు, సమకాలీన భారతదేశపు ప్రశ్నోత్తర చరిత్ర, అనే విలువైన గ్రంథాలు ఆయన ప్రకటించారు. కాని ఈ గ్రంథాలు భారత ప్రభుత్వ ప్రచురణ విభాగంగాని, ఆంధ్రదేశ ప్రభుత్వం కాని పునః ప్రచురణ యోగ్యత ఉన్నవిగా భావించలేదు.
ఆయన రచించిన గ్రంథాలలో 3కరెంట్ హిస్టరీ ఇన్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్2 అనే గ్రంథం చాలా విలువైనది. ఇందులో వెయ్యి ప్రశ్నలు. వాటి సమాధానాలు ఆయన రూపొందించారు. రెండు ప్రపంచ యుద్ధాల మధ్య ఆనాటి అగ్రరాజ్యాల దురహంకారాన్ని, కుట్రలను, రాజ్య విస్తరణ కాంల్రను, మోసాలను, దౌర్జన్యాన్ని స్థూలంగా ప్రస్తావిస్తూ, భారతదేశ స్వాతంత్య్రానంతరం పునర్నిర్మాణాన్ని, భారతదేశం అజేయమైన శక్తిగా ఎదగడాన్ని ప్రధానంగా కాంక్షిస్తూ, ఈ భారతదేశ సమకాలీన చరిత్రనాయన ప్రశ్నోత్తర రూపంగా సంధానించారు. భోగరాజు పట్ట్భాసీతారామయ్యకు ఒక అసాధారణమైన అభిరుచి ఉండేది. అదేమంటే తాను ఏ బహిరంగ సభలో పాల్గొన్నా, కళాశాల, విశ్వవిద్యాలయ వారికోత్సవాలలో పత్రికా విలేఖరుల సమావేశాలలో, పాల్గొన్నా శ్రోతలను ప్రశ్నలు వేయవలసిందిగా ప్రోత్సహించేవారు. ఈ ప్రశ్నలు, తానిచ్చిన సమాధానాలు భద్రపరచి 1946-48 మధ్య కలకత్తాలో ఆయన ఒక బృహత్సంపుటంగా ప్రచురింప చేశారు. ఈ పుస్తకం ఉనికి ఇప్పుడెవరకూ తెలియదు.
ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన తనకు బ్యాంకింగ్ వ్యవస్థ, సహకార రంగ వ్యవస్థలలో ఎట్లా అభిలాష ప్రవేశం కలిగిందో చెపుతూ 1915లో తాను కో-ఆపరేటివ్ బ్యాంకు వ్యవస్థకు రూపకల్పన చేసినట్లు చెప్పారు. కాబట్టి కో-పరేటివ్ రంగ వ్యవస్థకీ ఈ సంవత్సరం శతజయంతిని ఆంధ్ర ప్రభుత్వం జరుపుతున్నది. 1923లో తనకు పక్షం రోజులు విరామం, విశ్రాంతి లభించగా ఆంధ్రాబ్యాంక్ స్థాపించినట్లు చెప్పారు. 1915లో ఇన్సూరెన్స్ వ్యవస్థను రూపొందించినట్లు చెప్పారు. అఖిల భారత సంస్థాన ప్రజల కాంగ్రెసుకు అధ్యక్షులై అయిన స్వతంత్ర భారత పునర్వికాసానికి ఎంతో కృషి చేశాడు. సిద్ధాంత భూమికను పట్ట్భాసిద్ధపరచగా సర్దార్ పటేల్ కార్యనిర్వహణతో కృతకృత్యుడైనట్లు ఈ ప్రశ్నోత్తర సమకాలీన భారతదేశ చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు. జాతీయవాదులైన ముస్లిములంటె ఎవరు? (ప్రశ్న 739) అని ఆయన్ను ఒక సభలో ఒకరు ప్రశ్నించారు. దీనికి పట్ట్భా సమాధానం ఇట్లా ఉంది.
3‘‘జాతీయ ముస్లిములని ఎవరినంటామంటే మొదట తాను భారతీయుడిననీ, తరువాతనే ముస్లిమ్‌ననీ అనుకుంటే వారు జాతీయ ముస్లిములు. ఇట్లా కాక మొదట ముస్లిములమనీ, తరువాతనే జాతీయత గూర్చి ఆలోచిస్తామనే వాళ్లు జాతీయ ముస్లిములు కారు. జాతీయవాదులైన ముస్లిములు కొందరున్నారు. కాంగ్రెసు సంస్థ అధ్యక్షులైన వారే ఎనిమిది తొమ్మిది మంది దాకా ముస్లిములున్నారు. ఉన్నత స్థానాలలో ఉన్న వారు కూడా ఎందరో ఉన్నారు. అయితే ఒక విషయం మనం తెలుసుకోవాలి. ముస్లిములకు ప్రత్యేక హక్కులుండాలంటారు వీళ్లు.’’ ఇటువంటిదే ఇంకో ప్రశ్నకు ముస్లిములు ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచినట్లూ, దానిలో హిందువులతో అన్నిటా సమాన హక్కులు కావాలన్నట్లూ పట్ట్భా చెప్పారు. అంటే పర్యాయక్రమంగా సుప్రీమ్‌కోర్టు ప్రధాన న్యాయమూర్తి తమకు కావాలనీ, సుప్రీమ్‌కోర్టు జడ్జీలను నియామకం చేసేప్పుడు తమను సంప్రదించి తమకు అంగీకారమైతేనే వారిని నియమించవలసినట్లూ ముస్లిమ్ లీగ్ వారి రాజ్యాంగంలో ఉందట. వందేమాతరంపట్ల నిరసన, భారతదేశ విభజనలో ఇంగ్లీషు వారి దన్ను, కుట్రలు, కుహకాలతో ముస్లిములు నిర్వహించిన హింసాకాండ కూడా పట్ట్భారాసిన ఈ సమకాలీన భారతదేశ ప్రశ్నోత్తర చరిత్రలో ప్రసక్తమైనాయి. కాంగ్రెస్ వారి నింద్య చరిత్ర కూడా ఆయన మొహమాటం లేకుండా చెప్పాడు.

- అక్కిరాజు రమాపతిరావు ఫోన్: 040-27423352