ఆంధ్రప్రదేశ్‌

పట్టిసీమ పథకం చరిత్రాత్మకం : చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: పట్టిసీమ ఎత్తిపోతల పథకం అసాధ్యమని కొందరు పందేలు కాశారని, మరికొందరు రాజకీయ సన్యాసం చేస్తామంటూ సవాల్‌ చేశారని, వారందరికీ పట్టిసీమ ప్రారంభంతో కనువిప్పు కలగాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలో నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి బుధవారం ఆయన నీటిని విడుదల చేశారు. ఎత్తిపోతల పథకంలో 24 పంపుల నిర్మాణం పూర్తికావడంతో ఇవాళ అధికారికంగా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పట్టిసీమ పథకం చరిత్రాత్మకమని, పట్టిసీమ ద్వారా 8,500 క్యూసెక్కుల నీటిని కృష్ణా నదికి అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. అసాధ్యమనుకున్న పట్టిసీమ ఎత్తిపోతలను తమ ప్రభుత్వం సుసాధ్యం చేసిందన్నారు. గతేడాది 9టీఎంసీల నీటిని కృష్ణా నదికి మళ్లించి కృష్ణా డెల్టా కింద వేలాది ఎకరాల పంటను కాపాడగలిగామన్నారు. మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, పీతల సుజాత, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్‌, పి.మాణిక్యాల రావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెదేపా నేతలు, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.