ఆంధ్రప్రదేశ్‌

తుని ఘటనలో అసాంఘిక శక్తులు: పవన్ కల్యాణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాపు గర్జన సందర్భంగా తునిలో రైలును దగ్ధం చేయడం వంటి హింసాత్మక సంఘటనల వెనుక అసాంఘిక శక్తుల ప్రమేయం ఉందని సినీ హీరో పవన్‌కల్యాణ్ అనుమానం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అగ్గిపుల్ల గీస్తే రైలు తగలబడిపోదని, ఒక వ్యూహం ప్రకారమే కాపు గర్జనలో కొందరు హంసకు పాల్పడ్డారని అన్నారు. రిజర్వేషన్ల విషయమై ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు చెప్పాలని, ఉద్యమాలు చేసే వరకూ కాలయాపన చేయరాదన్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలో ఉద్యమాలు ఎపుడూ ప్రశాంతగానే ఉంటాయని, అయితే తుని సంఘటనలను పరిశీలిస్తే ఒక వ్యూహం ప్రకారం హింస చోటుచేసుకుందన్నారు. ఉద్యమాలు జరుగుతున్నపుడు ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పవన్ అన్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీం కోర్టు ఆదేశాలను కాదని కొత్తగా కాపులకు ఎలా ఆ సౌకర్యం కల్పిస్తారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని, బీసీలను ఒప్పిస్తేగానీ ఈ సమస్య కొలిక్కిరాదన్నారు. తాను కాపుల తరఫున మాట్లాడడానికి రాలేదని, దేశం కోసం పాటుపడే వ్యక్తిగా మాట్లాడుతున్నానని చెప్పారు. రిజర్వేషన్లు ఇవ్వడం అసాధ్యమైతే ఆ విషయం కాపులకు ముందుగానే చెప్పాలని, వారిలో లేనిపోని ఆశలు రేకెత్తించి వంచించడం సరికాదన్నారు. కాపుల సమస్యకు సంబంధించి తాను ప్రభుత్వ వ్యవహారాల్లో తలదూర్చలేనని, తుని సంఘటనపై న్యాయ విచారణ జరిపించి హింసకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, హెచ్‌సియులో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటన తనను కలచివేసిందని పవన్ అన్నారు.