జాతీయ వార్తలు

పేటీఎం యజమానిని బెదిరించిన ఉద్యోగులు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ వ్యక్తిగత సమాచారాన్ని బయటపెడతామని, అలా చేయకూడదనుకుంటే తమకు రూ.20 కోట్లు ఇవ్వాలని బెదిరించిన ఆయన కిందిస్థాయి ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ఈమధ్య కాలంలో విజయ్‌శేఖర్ శర్మ పేటీఎం సంస్థకు చెందిన సమాచారాన్ని పోగొట్టుకున్నారు. శేఖర్ శర్మ ల్యాప్‌టాప్, సెల్‌ఫోను, పీసీ నుంచి సోనియా థావన్ అనే మహిళా ఉద్యోగి దొంగిలించింది. ఈ సమాచారాన్ని బయటపెడతామని సోనియా థావన్‌తో పాటు మరో ఇద్దరు ఉద్యోగులు కలిసి శేఖర్ శర్మను బెదిరించారు. సమాచారం బయటపెట్టకూడదంటే రూ.20 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శేఖర్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇద్దరు ఉద్యోగులను అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.