కృష్ణ

రేపు శ్రీ సీతారామ యతీంద్రుల శ్రీకృష్ణ సాక్షాత్కార వార్షికోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, డిసెంబర్ 27: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న పెదముత్తేవి శ్రీకృష్ణాశ్రమం వ్యవస్థాపకులు, ముముక్షుజన మహాపీఠం వ్యవస్థాపకులు శ్రీ సీతారాం యతీంద్రుల శ్రీకృష్ణ దివ్య సాక్షాత్కార మహోత్సవ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు ఆదివారం పెదముత్తేవి తరలివచ్చారు. 1906లో జన్మించిన వీరు 1936లో శ్రీకృష్ణాశ్రమాన్ని స్థాపించి కుల మతాలకు అతీతంగా భగవన్నామ ప్రచారం సాగించారు. 1938లో వీరికి శ్రీకృష్ణ పరమాత్ముని దివ్య సాక్షాత్కారం లభించింది. అనంతరం 1959లో ముముక్షుజన మహాపీఠాన్ని స్థాపించారు. వీరి అనంతరం 1972 అక్టోబర్ 30న శ్రీ లక్ష్మణ యతీంద్రులు ముముక్షుజన మహాపీఠానికి ఆధిపత్యం వహించారు. 1992 డిసెంబర్ 13న శ్రీ లక్ష్మణ యతీంద్రులు అవతారం చాలించిన సందర్భాలను పురస్కరించుకుని ఈ నెల 29న శ్రీకృష్ణాశ్రమంలో సామూహిక ఉపనయనాలు శ్రీ సీతారాం గురుదేవుల పర్యవేక్షణలో జరుగుతాయని కార్యదర్శి తుర్లపాటి రాధాకృష్ణ తెలిపారు.

కూరాడలో మూడు పూరిళ్లు దగ్ధం
గుడ్లవల్లేరు, డిసెంబర్ 27: మండల పరిధిలోని కూరాడ గ్రామంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో మూడు పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో సుమారు రూ.11లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది. సమీపంలో ఉన్న 10 ఎకరాల గడ్డివామి, ఎకరంన్నర ధాన్యం కుప్ప, రెండు పశువుల పాకలు కూడా దగ్ధమయ్యాయి. గుడివాడ అగ్నిమాపక అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి వచ్చేసరికే ఎండి బాషా, ఎండి దాదా, ఎండి సల్మాన్ నివాసాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. 35కాసుల బంగారం, లక్షా 20వేల రూపాయల నగదు దగ్ధమైనట్లు బాధితులు చెబుతున్నారు. బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ఎంఆర్‌ఐ లక్ష్మీనారాయణ, విఆర్‌ఓ మల్లిఖార్జునరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
జిల్లా విద్యాశాఖ ప్రగతిని వివరించాలి
మచిలీపట్నం, డిసెంబర్ 27: జన్మభూమి గ్రామసభల్లో జిల్లా విద్యాశాఖ పనితీరు, ప్రగతిని వివరించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎ సుబ్బారెడ్డి తమ శాఖాధికారులను ఆదేశించారు. జనవరి 2 నుండి 11 వరకు నిర్వహించనున్న జన్మభూమి - మా ఊరు గ్రామసభల్లో విద్యాశాఖాధికారులు అవలంభించాల్సిన విధానాలపై ఆదివారం ఆయన డివైఇఓ, ఎంఇఓలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. గ్రామసభల్లో విద్యాశాఖకు సంబంధించి వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో 135 పాఠశాలల్లో నూతనంగా మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందన్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. మార్చిలో నిర్వహించే పదో తరగతి పరీక్షల్లో నూటికి నూరుశాతం ఫలితాలు సాధించటంతో పాటు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించాలన్నారు. ప్రతి సోమవారం ‘మీ కోసం’లో వచ్చే అర్జీలను కూడా పరిగణనలోకి తీసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సుబ్బారావు సూచించారు. ఈ సమావేశంలో బందరు, నూజివీడు డివైఇఓలు గిరికుమారి, లక్ష్మీనారాయణ, ఎడి బాబు, తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం
పెనుగంచిప్రోలు, డిసెంబర్ 27: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి టిడిపి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ అన్నారు. మండలంలోని గుమ్మడిదుర్రు, ముచ్చింతాల, పెనుగంచిప్రోలు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ముచ్చింతాల, గుమ్మడిదుర్రు గ్రామాల్లో ఎస్‌సి సబ్ ప్లాన్ కింద రూ.50 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను శ్రీరాం రాజగోపాల్ ప్రారంభించారు. పెనుగంచిప్రోలు పంచాయతీ కార్యాలయానికి స్వచ్చ్భారత్ కింద మంజూరైన ట్రాక్టర్‌ను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి నిలిపిందని, ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధిక నిధులు మంజూరు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి సభ్యురాలు గింజుపల్లి శ్రీదేవి, ఎంపిపి వెల్ది జ్యోతి, మండల తెదేపా అధ్యక్షుడు చింతల సీతారామయ్య, పొన్నం రంగారావు, ఊట్ల నాగేశ్వరరావు, కర్ల వెంకట నారాయణ, గోనెల శివ, నల్లపునేని వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.

యువతను సన్మార్గంలో నడపాలి:డా.ఆచార్య
మచిలీపట్నం, డిసెంబర్ 27: యువతను సరైన దారిలో నడిపించాల్సిన బాధ్యత పెద్దలదేనని ప్రముఖ కంటి వైద్య నిపుణులు డా. బి ధన్వంతరి ఆచార్య అన్నారు. స్థానిక గాంధీనగర్ వాకర్స్ భవన్‌లో ఆదివారం ఉదయపు నడక మిత్ర మండలి, మహిళా విభాగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ నైతిక విలువలతో కూడిన విద్యను నేర్పించాలని, నేటి విద్యార్థులే భావిభారత పౌరులన్నారు. సభకు అధ్యక్షత వహించిన పెసల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వాకర్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో పట్టణ శాఖకు రెండు పురస్కారాలు లభించినట్లు తెలిపారు. అనంతరం నూతన పాలకవర్గ సభ్యుల ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా పిఎన్‌ఆర్ ఆంజనేయులు, కార్యదర్శిగా మేడిశెట్టి వీర వెంకటేశ్వరరావు, కోశాధికారిగా మద్దాలి వెంకట సుబ్బారావు ఎన్నికయ్యారు.

కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయ ఇంట్లో చోరీ
కలిదిండి, డిసెంబర్ 27: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయ ఇంట్లో చోరీ జరిగింది. మండల పరిధిలోని ఆవకూరులోని రామాంజనేయ నివాసంలో శనివారం గుర్తుతెలియని దుండగులు తలుపులు, తాళాలు పగులకొట్టి చోరీకి పాల్పడ్డారు. పూజగదిలోని సుమారు రూ.20వేలు విలువైన వెండి ఆభరణాలు తస్కరించారు. ఇనుప బీరువాను పగులకొట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ నెల 25న చలమలశెట్టి రామాంజనేయ దంపతులు ఇంటికి తాళం వేసి కాలినడకన ద్వారకా తిరుమల బయలుదేరి వెళ్లారు. శనివారం రాత్రి సుమారు 11గంటలకు ఇంటికి వచ్చేసరికి తలుపులు పగులకొట్టి ఉండటాన్ని గుర్తించారు. దీనిపై కలిదిండి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ గౌతమ్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మచిలీపట్నం నుండి వచ్చిన క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరించారు.