పేదరికం పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేబి వౌనిక, రమణి, చంద్రమోహన్, గుండు హన్మంతరావు ముఖ్యపాత్రల్లో పి.అమర్‌నాథ్‌రెడ్డి దర్శకత్వంలో మిత్ర ప్రొడక్షన్స్ బి.సుధాకర్ నాయుడు సమర్పణలో బి.మదనగోపాల్‌నాయుడు నిర్మిస్తున్న చిత్రం ‘పేదరికం’. పిల్లల పాలిట శాపమా? అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు సముద్ర ఆడియో సీడీని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇది చాలా చక్కని టైటిల్ అని, దీపం వెలుగునిస్తుందని, చదువు జ్ఞానాన్ని పెంచుతుందని, మంచి సందేశాత్మక చిత్రంగా తెరకెక్కించారన్నారు. ముఖ్యంగా బేబి వౌనిక చక్కగా నటించిందని, ఇలాంటి చిత్రాల్ని తప్పకుండా చూడాలన్నారు. సంగీత దర్శకుడు సాలూరి సతీష్ మాట్లాడుతూ, ఇంత మంచి చిత్రానికి పాటలు అందించడం ఆనందంగా వుందన్నారు. నిర్మాత గోపి మాట్లాడుతూ, తాను చూసిన కొన్ని నిజ సంఘటనల్ని ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించానని, అందరికీ నచ్చేలా తెరకెక్కిన ఈ చిత్రం మంచి సందేశాన్ని అందించే విధంగా ఉంటుందని అన్నారు. దర్శకుడు అమర్‌నాథ్ మాట్లాడుతూ, ఇలాంటి సినిమాలు ప్రేక్షకుల్లో ఆలోచనలు కలిగిస్తాయని, పేదరికం ఏ పిల్లలకు శాపం కాకూడదనే కానె్సప్ట్‌తో తెరకెక్కించిన చిత్రమిదని, త్వరలోనే విడుదల చేస్తామన్నారు.