మీకు తెలుసా ?

ఈ పీత కాళ్ల పొడవు 12 అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జపనీస్ స్పైడర్ కాబ్‌గా పిలిచే ఈ పీత భూమీద ఉండే అతిపెద్ద పీత. వీటి కాళ్ల పొడవు 12 అడుగుల దాకా ఉంటుంది. ఎరుపుఛాయ, తెల్లని చుక్కలతో కూడిన వీటి మేని, రూపం భయపెడతాయి. జపాన్ సముద్రజలాల్లో మాత్రమే ఇవి కన్పిస్తాయి. అన్నట్లు అతిదీర్ఘకాలం బతికే జంతువల్లో ఇది రెండోది. తాబేళ్ల తరువాతి స్థానం దీనిదే. కనీసం వందేళ్లు బతకడం వీటి ప్రత్యేకత. వీటి కాళ్ల పొడవు ఎంతున్నా వీటి పరిమాణం అడ్డంగా ఒక అడుగుకు మించదు. ఇవి కరిస్తే బాగా సలుపు ఉంటుంది. మనిషికి వీటివల్ల ప్రాణాపాయం ఉండదు.

ఫెర్న్‌కు పూలు, పండ్లు ఉండవు..
ఔను ఇది నిజమే...అలంకరణ మొక్కలుగా పెంచుకునే ఫెర్న్‌కు పూలు, కాయలు ఉండవు. అంటే విత్తనాలు ఉండవన్నమాట. కానీ దానికి పునరుత్పత్తి సాధ్యమే. వాటి ఆకులకింద తయారయ్యే ఒకతరహా పదార్థం ‘స్పోర్స్’ చిన్నపాటి విత్తనాల్లా కన్పిస్తాయి. వీటివల్లే కొత్తఫెర్న్ మొలకెత్తుతుంది. నీటిలో పడిన తరువాత అవి ఫలదీకరణం చెంది కొత్త చిగురు తొడుగుతుంది. గబ్బిలాలు, కొన్నిరకాల ఎలుకలకు ఇవంటే చాలాఇష్టం. భూమిపై ఇవి 40 కోట్ల సంవత్సరాలనుంచి ఉన్నాయి. వీటిలో 12వేల జాతులుంటే అందులో 18శాతం మేరకు మెక్సికోలోనే కన్పిస్తాయి.

ఈ చిలుకలు తేనె తాగుతాయి...
చిలకజాతికి చెందిన ‘లోరి’ పక్షులు ఇవి. మెరుపులతోకూడిన రంగుల్లో ఇవి కన్పిస్తాయి. సాధారణ చిలకలకన్నా కాస్త సైజులో చిన్నవి. అయితే మిగతా జాతుల చిలకలకన్నా ఇవి భిన్నమైనవి. కేవలం మకరందం, పుప్పొడిని మాత్రమే ఇవి తింటాయి. పుష్పాల్లోని తేనెను జుర్రడానికి వీలుగా వీటి నాలుక ప్రత్యేకంగా ఉంటుంది. నాలుక బయటకు చాచేటపుడు మడతవిప్పినట్లు వచ్చి తేనె లేదా పుప్పొడిని అద్దుకుని మళ్లీ నోట్లోకి మడిచి పెట్టుకోవడం ఈ చిలకల ప్రత్యేకత. తేనె, పుప్పొడి అంటుకోవడానికి వీలుగా వీటి నాలుకపై బొడిపల్లాంటి నిర్మాణం ఉంటుంది. లోరీ, లోరికీట్స్ అనే రెండురకాలు వీటిలో ఉన్నా తోకల పొడవు, నాలుకను బట్టి మాత్రమే వాటిని గుర్తించే వీలుంటుంది.

పచ్చని పుచ్చకాయలూ ఉన్నాయ్..
ఎర్రగా ఉండే పుచ్చకాయలు అందరికీ తెలుసు. కానీ పసుపువర్ణంలో ఉండేవీ లభిస్తాయి. తెలుపు, పర్పల్ రంగులో ఉండే వాటర్‌మెలన్స్ కొన్నిచోట్ల లభిస్తాయి. టమోటాల్లో ఎరుపురంగుకు కారణమైన లైసోపిన్ అనే యాంటాక్సిడెంట్ పుచ్చకాయల్లోనూ ఉంటే అవి ఎర్రగా ఉంటాయి. నిజానికి టమోటాల్లోకన్నా పుచ్చకాయల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. అందుకే అవి టమాటోలకన్నా ఎర్రగా ఉంటాయి. లైసోపిన్ లేనిపక్షంలో ఆ పుచ్చకాయలు పసుపు లేదా మరికొన్ని యాంటాక్సిడెంట్లవల్ల ఇతర రంగుల్లోనూ కన్పిస్తాయి. పోషకవిలువలు మాత్రం అన్నింటా దాదాపు ఒకటే.

-ఎస్.కె.కె.రవళి