బిజినెస్

సిఐఐ చైర్మన్‌గా నృపేందర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) తెలంగాణ విభాగం చైర్మన్‌గా పెన్నార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ నృపేందర్‌రావు ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) టెక్నాలజీ బిజినెస్ యూనిట్ గ్లోబల్ హెడ్‌గా ఉన్న వి.రాజన్న ఎన్నికైనట్లు సిఐఐ వర్గాలు తెలిపాయి. వీరు 2016-17 సంవత్సరానికి సిఐఐ తెలంగాణ విభాగానికి నేతృత్వం వహిస్తారు. నృపేందర్‌రావు ఇంతకు ముందు తెలంగాణ సిఐఐకి వైస్‌చైర్మన్‌గా ఉన్నారు. యుఎస్‌ఏ నేషనల్ క్యాష్ రిజిష్టర్, యూనియన్ కార్బైడ్ ఇండియా, నాగార్జున గ్రూప్, పెన్నార్ గ్రూప్‌లో ఆయన పని చేశారు. 2013లో ఆయనకు ఔట్‌స్టాండింగ్ ఎంట్రప్రెన్యూర్ అవార్డు లభించింది. కాగా రాజన్న సిఐఐ స్టేట్ కౌన్సిల్ సభ్యుడిగా పని చేశారు.

పర్యాటక రంగంలో ఏపితో కలిసి పనిచేస్తాం : మలేషియా
హైదరాబాద్, మార్చి 17: పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేయడానికి మలేషియా సిద్ధంగా ఉందని మలేషియా రవాణా శాఖ మంత్రి లీవె షంగ్ లై స్పష్టం చేశారు. గురువారం సిఎం చంద్రబాబుతో అసెంబ్లీలోని ఆయన చాంబర్‌లో లీవె షంగ్ తన ప్రతినిధి బృందంతో కలిసి భేటీ అయ్యారు. ఓడరేవులు, ఎయిర్‌పోర్టులు, పట్టణాభివృద్ధిలో సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ తమకు 975 కి.మీ సముద్రతీరం ఉందని, పర్యాటక రంగ అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. బౌద్ద పర్యాటకానికి ఎపి ఒక కేంద్రంగా రూపుదిద్దుకోబోతోందని సిఎం వారికి వివరించారు. ఒకప్పుడు బౌద్దం విలసిల్లిన నేలపై ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామన్నారు. మలేషియా బృందంలో ఆ దేశ రవాణా శాఖ జనరల్ సెక్రటరీ సరిదుద్దీన్ ఖాసిం పాల్గొన్నారు.