పెరటి చెట్టు

అక్షర వృక్షానికి ‘వంద’నం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది మార్చ్ ఇరవయ్యో తేదీన ‘ఆంధ్రభూమి’ దినపత్రికలో ‘పెరటి చెట్టు’ రోజూవారీ ‘కాలమ్’గా మొదలయింది.
అంటే ఇవాళ్టికి నాలుగు రోజులు తక్కువగా నాలుగు నెలల కాలం అయిందన్న మాట.
మొన్న శనివారంనాడు సురవరం ప్రతాపరెడ్డి గారి గురించి రాసిన రైటప్‌తో వంద ఖండికలు పూర్తయ్యాయి.
ఇంతటితో విరమించడం మీకూ-నాకూ కూడా బావుంటుందని అనిపించింది.
అందుకే మీతో ప్రత్యక్షంగా ఈ నాలుగు ముక్కలూ చెప్పాలనిపించింది.
ఇంతకాలమూ - ఆదివారాలు మినహాయించి - క్రమం తప్పకుండా మీతో మాట్లాడుతూనే వచ్చాను.
ప్రతిరోజూ మీతో నా అభిప్రాయాలు పంచుకోనిచ్చినందుకు పత్రిక యాజమాన్యానికి కృతజ్ఞతలు.
అంతకుమించి -
తెలుగు సాహిత్యం గురించీ, కవులూ కావ్యాల గురించీ, విభిన్న సాహిత్య ధోరణుల గురించీ
ఈ నాలుగు నెలలూ, నా అభిప్రాయాలు మీతో కలబోసుకోనిచ్చినందుకు మీకూ కృతజ్ఞత శతాలు.
ముఖ్యంగా, దాదాపు ప్రతిరోజూ - ఫోన్‌లో - పలకరించి నా అభిప్రాయాల మీద తమ అభిప్రాయాలు తెలియచేసిన
మిత్రులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు.
‘పెరటిచెట్టు’ మొదలుపెట్టక ముందు, ఈ ‘మిత్రుల’లో చాలామందితో నాకు ముఖపరిచయం కూడా లేదు.
అయితే, నా అభిప్రాయాలు నేనెలాగయితే నిర్మొహమాటంగా ప్రకటించానో, అచ్చం అలాగే నా మిత్రులు కూడా
స్పందించడం గొప్ప అనుభవం.
మీ దగ్గిర నుంచి సెలవు తీసుకునే ముందు ‘పెరటి చెట్టు’ రాయడం వెనక నా ఉద్దేశాలేమిటో క్లుప్తంగా వివరిస్తాను.
‘పెరటి చెట్టు’ను తెలుగు సాహిత్య చరిత్ర సంగ్రహంగా రాయాలన్నది నా ప్రయత్నం.
సాహిత్య చరిత్రను నిర్మించడమంటే-
ప్రకృతి దృశ్యాలతోనో, సినీ నటుల ముఖారవిందాలతోనో అలంకరించిన క్యాలెండర్‌ను తయారు చెయ్యడం కాదు.
తిథి వార నక్షత్రాలతో కూడి వుండే పంచాంగం రూపొందించడం అసలే కాదు.
కిందా మీదా పడి, కవుల చరిత్రల పేరిట వంశావళులూ, జాతకాలూ పోగేయడమూ కాదు.
ఆయా రాజసభల్లో పుంభావ సరస్వతులకు అందుతూ ఉండిన ఘనసంభావనల పట్టికలు తయారు చెయ్యడం
ఎంత మాత్రం కాదు.
శాసనాలను వదిలిపెట్టి, చమత్కార శ్లోక కథలనూ, చాటువులనూ ఆశ్రయించడం చరిత్ర నిర్మాణం కానేరదు.
నవరత్నాలూ అష్టదిగ్గజాలూ ఒకే కాలానికి చెందినవారని రుజువు చేసేందుకు తలకిందులుగా తపస్సు చెయ్యడం
ఏమయినా కావచ్చు -
కానీ, సాహిత్య చరిత్రను నిర్మించడం మాత్రం కానేకాదు!
ఒక్కమాటలో చెప్తే, ‘ప్రధాన స్రవంతి చరిత్ర రచన’తో సాహిత్య పరిణామ క్రమాన్ని ముడివెయ్యడమే సాహిత్య చరిత్ర నిర్మాణం.
సాహిత్యం ఏ క్రమాన్ని పాటించి ముందుకు పోయిందో చహరా తియ్యడమే సాహిత్య చరిత్ర నిర్మాణంలో తొలి అడుగు.
దొరికిన ఆధారాలను తర్కబద్ధంగా విశే్లషించుకుంటూ పోయి, కచ్చితమయిన భౌతిక ఆధారాల గీటురాళ్లపై నిజాన్ని
నిగ్గుతేల్చడం మలి అడుగు.
ఈ ప్రయత్నంలో ఎనె్నన్నో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి.
తుదీ మొదలూ కనిపించని ప్రశ్నార్థకాలు అకస్మాత్తుగా మనముందు ప్రత్యక్షమవుతూ ఉంటాయి.
వాటి పొడుగూ వెడల్పూ లోతూ కనుక్కునే ప్రయత్నంలో ఏళ్లూ పూళ్లూ గడిచిపోతుంటాయి.
అంతా జరిగిన తర్వాతగానీ, సాహిత్య చరిత్రలో ఈ ప్రశ్నార్థకాల కన్నా, వాటికి దొరుకుతున్న అరకొర జవాబులే
ఎక్కువ కీలకమనే వాస్తవం బోధపడదు.
ఇన్ని చెప్పి ఈ మాట చెప్పకపోతే తప్పవుతుంది-
ఇందులో సాహిత్య చరిత్ర నిర్మాణానికి సంబంధించిన సూత్రాలు లేవు.
ఈ క్రమంలో పాటించాల్సిన విధినిషేధాలు అంతకన్నా లేవు.
‘పెరటి చెట్టు’ వ్యాసాలు రాస్తున్న సందర్భంగా నాకు ఏర్పడిన కొన్ని అభిప్రాయాలు నిజాయితీగా మీ ముందుంచుతున్నా.
మీ

-మందలపర్తి కిషోర్ 81796 91822