కృష్ణ

కుక్కపిల్ల ఆశచూపి బాలికపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, డిసెంబర్ 7: అభం శుభం ఎరుగని, ముక్కుపచ్చలారని బాలికపై అత్యాచారం చేసిన కామాంధుని ఉదంతమిది. మండలంలోని కీర్తిరాయనిగూడెంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం రెడ్డిగూడెం మండలం రెడ్డిగూడెంకి చెందిన ఒక మహిళ తన కుమార్తె(8)ను తీసుకుని తన పుట్టింటికి కీర్తిరాయినిగూడెం చర్చిలో ప్రార్థనకు ఈ నెల 5న వచ్చింది. ఆ బాలిక సోమవారం ఉదయం ఇంటి వద్ద ఉన్న సమయంలో సమీపంలో ఉంటున్న మల్లాది సురేంద్రబాబు (17) బాలికను పిలిచి మా యింటి వద్ద కుక్కపిల్లలున్నాయని చూపుతానని నమ్మించి తన ఇంటికి తీసుకెళ్ళి ఆ బాలికపై అత్యాచారం చేశాడు. ఆ బాలిక తీవ్ర రక్తస్రావంతో ఏడ్చుకుంటూ ఇంటికి వస్తుండగా తన కుమార్తెను వెదుకుతూ తల్లి ఎదురు వెళ్ళింది. కుమార్తెను చూసి ప్రశ్నించగా జరిగిన విషయాన్ని చెప్పి విలపించింది. వెంటనే ఇరుగు పొరుగు నరేంద్రబాబును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ అల్లు దుర్గాప్రసాద్ తెలిపారు.

డివిజన్‌ను అగ్రస్థానంలో ఉంచేందుకు కృషి
నూజివీడు, డిసెంబర్ 7: డివిజన్‌ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉంచేందుకు కృషి చేస్తానని నూజివీడు సబ్ కలెక్టర్ జి లక్ష్మిష పేర్కొన్నారు. నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో లక్ష్మిష సబ్ కలెక్టరుగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డివిజన్‌లో సమస్యలను అవగాహన చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్‌లోని అందరి అధికారుల సహకారం, సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని అన్నారు. నూజివీడు డివిజన్‌లో స్వచ్ఛ పరిపాలనకు ప్రచార మాధ్యమాలు, ప్రజా ప్రతినిధులు సహకారం అందించాలని, ఎటువంటి సమస్య అయినా తన దృష్టికి తెస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని సబ్ కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందాలని, అవకతవకలు లేకుండా పారదర్శకంగా అమలుచేయడానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో నూజివీడు ఆర్డీవో చెరుకూరి రంగయ్య, డిఎస్‌పి టిఎస్ వెంకటరమణ ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యాలయ పరిపాలనాధికారి పద్మ, సిబ్బంది, వివిధ మండలాలకు చెందిన తహశీల్దార్లు సబ్ కలెక్టర్ లక్ష్మిశను మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.