జాతీయ వార్తలు

ఈపీఎఫ్ వడ్డీ 8.55 శాతమే.. తగ్గించిన ఈపీఎఫ్‌ఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) వడ్డీ రేటు 2017-18 ఆర్థిక సంవత్సరానికి 8.55 శాతానికి తగ్గింది. ఆరు కోట్ల మందికి పైగా ఉన్న ఈపీఎఫ్ చందాదారులకు గత ఆర్థిక సంవత్సరం చెల్లించిన 8.65 శాతం వడ్డీని ఈ ఆర్థిక సంవత్సరం 8.55 శాతానికి తగ్గించాలని ఎంప్లారుూస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) బుధవారం నిర్ణయించింది. ఈపీఎఫ్‌ఓ ట్రస్టీల సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని అనంతరం కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోశ్ గంగ్వార్ విలేఖరులకు వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం 8.65 శాతం వడ్డీని చెల్లించడం ద్వారా రూ. 695 కోట్ల మిగులు ఉందని, ఈ ఆర్థిక సంవత్సరం వడ్డీ రేటును 8.55 శాతానికి తగ్గించాలని నిర్ణయించినందున, రూ. 586 కోట్ల మిగులు ఉంటుందని అంచనా వేసినట్లు మంత్రి వివరించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే భవిష్యత్తును అంచనా వేయడం జటిలంగా ఉందని ఆయన పేర్కొన్నారు.