ఆంధ్రప్రదేశ్‌

మెడికల్ పీజి వెబ్‌కౌన్సిలింగ్ షెడ్యూల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ:తెలంగాణ, ఆంథ్రప్రదేశ్‌లలో మెడికల్ పీజి అడ్మిషన్ల కౌన్సిలింగ్‌ను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని, దీనికి సంబంధించి షెడ్యూల్ ఖరారు చేసినట్లు ఎన్టీఆర్ హెల్త్‌యూనివర్శిటీ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇందుకోసం విశాఖ, విజయవాడ, హైదరాబాద్, తిరుపతి కేంద్రాలు అందుబాటులో ఉంటాయని, ఈనెల 20నుంచి 23వరకు ధ్రువపత్రాలు పరిశీలిస్తామని, 21నుంచి 25వ తేదీవరకు ఆప్షన్ల ఎంపికకు అవకాశం ఇస్తామని, 27న సీట్ల కేటాయింపు జరుగుతుందని పేర్కొన్నారు. ఇక తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, విజయవాడలో కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 23నుంచి 25వరకు ధ్రువపత్రాల పరిశీలన, 24నుంచి 27వరకు ఆప్షన్ల ఎంపికకు అవకాశం ఇస్తారని, 29న సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. మే 2వ తేదీనుంచి తరగతులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.