తెలంగాణ

‘గాంధీ’ పిజి విద్యార్థి ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసుపత్రి ఆవరణలో ఉద్రిక్తత
విద్యార్థిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్, మార్చి 10: రాష్ట్రంలోని ప్రధాన ప్రభుత్వాసుపత్రుల్లో ఒకటైన గాంధీ ఆసుపత్రిలో గురువారం ఓ పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పిజి పరీక్షలో తనను కావాలనే ఫెయిల్ చేశారని విద్యార్థి మహమ్మద్ ఆజాం ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. దీంతో ఆసుపత్రి ఆవరణలో కాస్సేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. గురువారం ఉదయం ఆసుపత్రి సూపరింటెండెంట్ ఛాంబర్ వద్ద ఈ సంఘటన జరగడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థి ఆజాంను అడ్డుకున్నారు. గాయపడిన విద్యార్థి ఆజాంను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలు అందిస్తున్నారు.
నాకెలాంటి సంబంధం లేదు: సూపరింటెండెంట్
విద్యార్థి మహమ్మద్ ఆజాం ఆత్మహత్యాయత్నంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. పరీక్షల్లో ఫెయిల్ అయితే నాకేం సంబంధమన్నారు. ఆసుపత్రిలో ఇలాంటి సంఘటనలు మంచివికావన్నారు.