జాతీయ వార్తలు

ఫిలిబిత్ నకలీ ఎన్‌కౌంటర్ కేసులో 47 మంది పోలీసులకు జీవితఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: యుపిలోని ఫిలిబిత్ జిల్లాలో 1991 నాటి నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో 47 మంది పోలీసులకు జీవితఖైదు విధిస్తూ ఇక్కడి సిబిఐ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. ఈ కేసులో మొత్తం 57 మంది పోలీసులపై అభియోగాలు మోపగా, విచారణ కాలంలో పదిమంది పోలీసులు మరణించారు. మిగతావారందరినీ దోషులుగా సిబిఐ కోర్టు నిర్ధారించింది. 1991లో కొందరు సిక్కు యాత్రికులు మహారాష్ట్ర, బిహార్‌లో పుణ్యక్షేత్రాలను సందర్శించి ఫిలిబిత్ మీదుగా బస్సులో వెళుతుండగా పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఖలిస్తాన్ తీవ్రవాదులుగా భావించి పదిమంది సిక్కులను (1991 జూలై 12న) బస్సులో నుంచి కిందకు దింపేసి పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించడంతో కేసు విచారణను సిబిఐకి అప్పగించారు. పోలీసులు చెబుతున్నట్లు- కాల్పుల్లో మరణించిన వారు ఖలిస్తాన్ తీవ్రాదులు కారని, వారిపై ఎలాంటి నేరారోపణలు లేవని కోర్టు స్పష్టం చేసింది.