జాతీయ వార్తలు

పర్యావరణ పాపం.. పిల్లలకు శాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 25: పర్యావరణ కాలుష్యం వలన చిన్న పిల్లలు అధికంగా నష్టపోతున్నారని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు కట్టుదిట్టమైన పరిష్కారం అవసరమని ఆయన ఉద్ఘాటించారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) ఆధ్వర్యాన న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ‘ప్రపంచ పర్యావరణ సదస్సు-2017’ను రాష్టప్రతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా వ్యాధుల వలన ప్రజల ఆరోగ్యం క్షీణించడానికి 24 శాతం పర్యావరణ సమస్యలే ప్రధాన కారణమని, ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో 23 శాతం పర్యావరణ కాలుష్యం వల్లనే సంభవిస్తున్నట్లు ఇటీవల జరిగిన అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ‘పర్యావరణ సంబంధ వ్యాధుల వలన చిన్న పిల్లలు అధికంగా నష్టపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మరణిస్తున్న 15 ఏళ్ల లోపువారిలో 24 శాతం మంది డయేరియా, మలేరియా, శ్వాసకోశ సంబంధ వ్యాధులతోనే మరణిస్తున్నారు. ఇవన్నీ పర్యావరణ సంబంధ వ్యాధులే’ అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో 19 శాతం మంది క్యాన్సర్ వల్లనే మరణిస్తున్నారని, అర్థరహితమైన పారిశ్రామికీకరణతో వెలువడుతున్న కాలుష్య ఉద్గారాలే క్యాన్సర్ విస్తృతి కారణమని ప్రణబ్ స్పష్టం చేశారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ఈ సదస్సుకు విచ్చేసిన ప్రతినిధులను ప్రణబ్ సాదరంగా ఆహ్వానిస్తూ, అభివృద్ధి కోసం పర్యావరణాన్ని ఎంతమేరకు పణంగా పెట్టవచ్చన్న దానిపై చర్చించి కాలుష్యాన్ని అరికట్టేందుకు ఆచరణయోగ్యమైన పరిష్కారాలను అనే్వషించాలని సూచించారు.
మానవ కోటికి పెనుముప్పుగా మారిన వాతావరణ కాలుష్యంలో తమ పాత్ర ప్రధానమైనది అయినప్పటికీ ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని అందించడానికి అభివృద్ధి చెందిన దేశాలు సిద్ధంగా లేకపోవడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్ ఖేహర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ బాధ్యతలను నెరవేర్చడానికి సిద్ధంగా లేని సంపన్న దేశాల తీరును ఆయన దుయ్యబడుతూ, ప్రపంచ జనాభాలో అతి తక్కువ శాతం కలిగి ఉన్న ఈ దేశాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో అధిక భాగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నాయని, తద్వారా విషవాయువులను పెద్ద మొత్తంలో విడుదల చేస్తున్నాయని అన్నారు. ఫలితంగా అధిక జనాభా కలిగి ఉండే అభివృద్ధి చెందుతున్న దేశాలు సమస్యలను ఎదుర్కొంటున్నాయని జాతీయ హరిత ట్రిబ్యునల్ శనివారం ఇక్కడ పర్యావరణంపై ఏర్పాటు చేసిన ప్రపంచ సదస్సులో మాట్లాడుతూ చీఫ్ జస్టిస్ అన్నారు. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ మాట్లాడుతూ, పర్యావరణంతో ముడిపడిన ప్రాజెక్టులు నిర్మాణ దశలో లేదా నిర్మాణం పూర్తయిన తర్వాత ఏళ్ల తరబడి ప్రారంభం కాకుండా ఆగిపోకుండా చూడడానికి ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ, సభ్య సమాజం, వాటితో సంబంధం ఉన్న ఇతరులు కలిసి ఒక విధానాన్ని రూపొందించాలని సూచించారు.