అక్షర

పిల్లల వ్యక్తిత్వానికి వెన్నెల కాంతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘స్నేహపూర్ణిమ’
-చెరుకుపల్లి రామమూర్తి
వెల: రూ.50
దొరుకు స్థలం: చినుకు పబ్లికేషన్స్,
26-7-11, గరికపల్లి వారి వీధి,
గాంధీనగర్, విజయవాడ-520 003

చెరుకుపల్లి రామమూర్తిగారి పిల్లల నవల స్నేహపూర్ణిమ. స్నేహం ఎంత గొప్పదో, స్నేహం ఎంత తియ్యని దో స్నేహంలో త్యాగం కూడా ఎంతో తృప్తి నిస్తుందనీ, నిజమైన స్నేహాన్ని కాంక్షించేవారికి వారికి తెలియకుండానే ఉన్నత స్థానం, గౌరవం ఎలా దక్కుతుందో అడవిని ఆదర్శంగా పాలించే సింహరాజు, రాజుకి మంత్రిగా ఉన్న తెలివైన కుందేలు, బలవంతుడు, గుణవంతుడు అయిన ఏనుగు సేనాధిపతిగా, వాళ్ల స్నేహాన్ని గురించి, మంచి తనాన్ని గురించి ఎంతో సమర్ధవంతంగా హృదయానికి హత్తుకునేలా రచన చేసారు రామమూర్తిగారు. జిత్తులమారి ఓర్వలేని నక్క, తను తవ్వుకున్న గోతిలో తనే ఎలా పడిపోయిందో, శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ తెలిసిన సింహం రాజు, నక్కకి తేనెటీగల చేత ఎటువంటి శిక్ష విధించారో నవల మొత్తం పిల్లల చేత ఎటువంటి శిక్ష విధించారో నవల మొత్తం పిల్లలచేత చదివిస్తుంది. స్నేహం విలువ తెలియజేస్తుంది. స్నేహపూర్ణిమ అని పేరు పెట్టడం కూడా చాలా ఉత్తమంగా ఉంది. ప్రతి పాపాయి చదవదగ్గ పిల్లల నవల.

-శారదా అశోక్‌వర్ధన్