రాష్ట్రీయం

పైప్‌లైన్ల ద్వారా సాగునీరు అధ్యయనానికి మధ్యప్రదేశ్‌కు మంత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: మధ్యప్రదేశ్‌లో సాగునీటిని కాలువల ద్వారా కాకుండా పైప్‌లైన్ ద్వారా పొలాలకు అందిస్తున్న ప్రాజెక్టును పరిశీలించేందుకు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నాయకత్వంలో ఒక బృందం శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వెళుతోంది. ఓంకారేశ్వర్ ప్రాజెక్టు నాలుగవ దశను, లిఫ్ట్ ఇరిగేషన్, పునరావాస పనులను పరిశీలిస్తారు. ఓంకారేశ్వర్ ప్రాజెక్టులో పని చేస్తున్న ఇంజనీర్లతో సమావేశమవుతారు. రైతులతో కూడా ముచ్చటించి పైపులైన్ల ద్వారా నీటిని ఏ విధంగా పంపిణీ చేస్తున్నారో తెలుసుకుంటారు. రెండవ రోజు ఈ బృందం భోపాల్‌లో పర్యటిస్తుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో హరీశ్‌రావు బృందం సమావేశం అవుతుంది. ఇండోర్‌కు వెడుతున్న బృందంలో మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, ఆల వెంకటేశ్వరరెడ్డి, ప్రభుత్వ సాగునీటి సలహాదారు విద్యాసాగర్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కె జోషి, ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్, ఇరిగేషన్ ఇఎన్‌సి మురళీధర్‌రావు ఉన్నారు.