క్రీడాభూమి

ఇదేం కొత్తకాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: భారత్ పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలించడం కొత్త విషయమేమీ కాదని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పిచ్‌లపై చెలరేగుతున్న విమర్శలపై ఒక వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను స్పందిస్తూ, భారత దేశంలో మొదటి నుంచి స్పిన్నర్ల ఆధిపత్యం ఉందని అన్నాడు. అందుకే ఇక్కడి పిచ్‌లు వారికి అనుకూలంగానే ఉంటాయని పేర్కొన్నాడు. తమతమ బౌలర్లకు అనుకూలంగా పిచ్‌లను తీర్చిదిద్దడం ప్రతి దేశంలోనూ జరుగుతుందని, ఇందులో కొత్త విషయం ఏమీ లేదని అన్నాడు. మీడియా విమర్శల్లో ఎలాంటి ఔచిత్యం లేదని చెప్పాడు.