జాతీయ వార్తలు

బెంగళూరు విమానంలో పొగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: బెంగళూరు ఎయిర్‌పోర్టులో బుధవారం ఉదయం పది గంటలకు బయలుదేరిన విమానంలో ఆకస్మికంగా పొగలు రావడంతో దాన్ని వెంటనే కిందకు దింపారు. మంగళూరు వెళ్లాల్సిన ఈ విమానంలో 65 మంది ప్రయాణీకులు,నలుగురు సిబ్బంది ఉన్నారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలో పొగలు రావడంతో ప్రయాణీకులు ఆందోళన చెందారు. క్యాబిన్‌లో నుంచి పొగలు రావడంతో 10-20 గంటలకు విమానం తిరిగి బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగింది. ప్రయాణీకులంతా క్షేమంగానే ఉన్నారని, నలుగురికి మాత్రం ప్రథమచికిత్స అందించినట్టు అధికారులు ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇపుడు ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నందున ప్రయాణీకులు ఒక్కసారి గాభరా పడ్డారు.