తెలంగాణ

పోలీసులు స్పందించి ఉంటే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశు వైద్యురాలు ప్రియాంకారెడ్డి హత్యోదోంతంపై ఒక వైపు నిరసనలు వెల్లువెత్తుతుండగా.. పోలీసుల నిర్లక్ష్య ధోరణిపై కూడా ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయటానికి వెళితే పోలీసులు వెనువెంటనే స్పందించి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేదికాదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రియాంక కుటుంబ సభ్యులు ఫిర్యాదుకు వెళ్తే.. శంషాబాద్‌ ఆర్‌జీఐఏ పోలీసులు, శంషాబాద్‌ రూరల్‌ పోలీసులు తమ పరిధి కాదంటూ.. తమది కాదని తప్పించుకునే ప్రయత్నం చేశారు. వివరాల సేకరణ పేరుతో విలువైన సమయాన్ని వృథా చేశారు.
ఈ ఘటన నేపథ్యంలో నేడు జీరో ఎఫ్‌ఐఆర్ అమలు అంశం తెరపైకి వచ్చింది. ఎందుకంటే ఈ జీరో ఎఫ్‌ఐఆర్ అమలు చేయాలని కేంద్రం ఆమోదం కూడా తెలిపింది. ఎఫ్‌ఐఆర్ నమోదుచేసేటపుడు ఏదో ఒక నెంబరు కేటాయిస్తారు. ఒకవేళ ఘటన జరిగిన ప్రాంతం తమ పరిధిలోది కాకుంటే జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. దీనికి నెంబరు కేటాయించరు కానీ వెంటనే బాధితుల్లో భరోసాను నింపే అవకాశం ఉంది. మెడికో, లీగల్ కేసుల్లో అయితే ఆసుపత్రిలో చేర్పించి సంబంధిత పోలీసు స్టేషన్‌కు బదిలీ చేస్తారు. ప్రస్తుం ఈ విధానం ముంబయిలో ఉంది. హైదరాబాద్ వంటి మహా నగరంలో కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది.