బిజినెస్

ఇన్ఫోసిస్ పోచారం క్యాంపస్‌లో 6.6 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: దేశీయ ఐటి రంగంలో రెండో అతిపెద్ద సంస్థ ఇన్ఫోసిస్.. తెలంగాణలోని పోచారం వద్దనున్న క్యాంపస్‌లో సోమవారం 6.6 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించింది. ఈ మేరకు ఇన్ఫోసిస్ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఇప్పటికే ఈ ప్లాంట్‌కు 0.6 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ నుంచి విద్యుత్ అందుతుండగా, ఇప్పుడు మరో 6.6 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. దీంతో పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో 7.2 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి జరుగుతుండగా, పూర్తిస్థాయిలో పునరుత్పాదక శక్తి (రెన్యువబుల్ ఎనర్జీ)తోనే నడుస్తున్న కార్పొరేట్ క్యాంపస్‌గా దేశంలోనే పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ కు పేరొచ్చిందని ఆ సంస్థ పేర్కొంది. క్యాంపస్‌లోని సోలార్ పవర్ ప్లాంట్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేశామని, ఏటా 12 మిలియన్ కిలోవాట్ల విద్యుదుత్పత్తి జరగవచ్చని కూడా ఇన్ఫోసిస్ అంచనా వేసింది.
కాగా, పోచారంలోని ఇన్ఫోసిస్ ఐటి సెజ్ 450 ఎకరాల్లో విస్తరించి ఉంది. తొలి దశ నిర్మాణంలో 16,000 మందికి శిక్షణనిస్తున్న ఇన్ఫోసిస్.. రెండవ దశలో దీన్ని 25వేలకు తీసుకెళ్ళాలని భావిస్తోంది. మూడవ దశనూ ప్రారంభించాలని యోచిస్తోంది. ఇదిలావుంటే దేశవ్యాప్తంగా ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్‌లలో 12 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటవగా, రాబోయే రెండు నెలల్లో మరో 3 మెగావాట్ల ప్లాంట్లు పూర్తికానున్నాయి.
** పూర్తిగా సౌర విద్యుత్‌తోనే నడుస్తున్న పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ **