ఆటాపోటీ

‘పొడుగు’ ఫార్మెట్‌కు కొత్త రూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనే్డ ఇంటర్నేషనల్స్, ట్వంటీ-20 మ్యాచ్‌ల రంగ ప్రవేశంతో ప్రాభవం కోల్పోయి, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న టెస్టు క్రికెట్‌ను బతికించాల్సిన బాధ్యతను అందరూ కలిసి పంచుకోవాలి. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)తోపాటు, టెస్టు హోదాగల దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులు ఈ దిశగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించాలి. 138 సంవత్సరల ఘన చరిత్రగల టెస్టు క్రికెట్‌కు కొత్త ఊపిరి పోయడానికి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే పిచ్‌ల వివాదం తెరపైకి రావడం దురదృష్టరం. అయతే, సమస్యలను అధిగమించి టెస్టు క్రికెట్ బతికి బట్టకడుతుందని అనుకోవడానికి చాలా కారణాలనే పేర్కోవచ్చు. ఎన్ని ఫార్మెట్స్ వచ్చినప్పటికీ, క్రికెట్‌ను సమూలంగా అధ్యయనం చేయాలన్నా, నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నా టెస్టు ఫార్మెట్ ఆడక తప్పదని ఇప్పటికీ అంతా అంగీకరిస్తున్నారు. కాలంతో రూపురేఖలు మారుతున్నా, వౌలిక విధానాల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా సాగుతున్న ఘతన టెస్టు క్రికెట్‌కే దక్కుతుంది. వనే్డలు, ట్వంటీ-20 మ్యాచ్‌ల మాదిరిగానే టెస్టులను కూడా మధ్యాహ్నం ప్రారంభించి, రాత్రి ఫ్లడ్ లైట్ల వెలుగులోనూ కొనసాగించాలన్న చిరకాల డిమాండ్ నెరవేరడం ఒక కొత్త శకానికి శ్రీకారం చుట్టింది. అడెలైడ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మొట్టమొదటి డే/నైట్ టెస్టు ఈ ఫార్మెట్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్నది. ‘డే/నైట్ ప్లే’కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అయతే, అడెలైట్ పిచ్ బ్యాటింగ్‌కు అంతగా సహకరించకపోవడంతో మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది. పిచ్‌తోపాటు మ్యాచ్‌కి ఉపయోగించిన పింక్ బంతులతోనూ కొన్ని ఇబ్బందులు తలెత్తాయని విశే్లషకులు అంటున్నారు. కొన్ని చిన్నచిన్న సమస్యలను అధిగమిస్తే, డే/నైట్ టెస్టులకు విపరీతమైన డిమాండ్ వస్తుందనడం ఖాయం. సంప్రదాయంగా ఆటగాళ్లు వేసుకునే తెల్ల దుస్తుల స్థానంలోనే, రంగురంగుల దుస్తులను ప్రవేశపెట్టాలన్నది మరో ప్రతిపాదన. అది కూడా త్వరలోనే నెరవేరవచ్చు. డే/నైట్ ప్లే కొనసాగితే, టెస్టులకు కూడా అభిమానులు భారీ సంఖ్యలో హాజరవుతారన్న వాదనకు అడెలైడ్ టెస్టు బలాన్నిచ్చింది. అన్ని క్రీడల్లోనూ విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నప్పుడు క్రికెట్‌ను కూడా అదే పంథాలో నడిపించడానికి అభ్యంతరాలు పెట్టడంలో అర్థం లేదు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ వంటి ఎంతోమంది ప్రముఖులు కూడా ఫ్లడ్ లైట్ల వెలుతురులో మ్యాచ్‌లు ఆడడాన్ని చాలాకాలంగా సమర్థిస్తున్నారు. భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ షహీం ఆమ్లా తదితరులు కూడా గొంతు కలుపుతున్నారు. రంగురంగుల దుస్తులతో ఆటగాళ్లను మైదానంలోకి దింపి, నాలుగు ఇన్నింగ్స్‌ల టెస్టుకు బదులు పరిమిత ఓవర్లతో కూడిన రెండు ఇన్నింగ్స్ మ్యాచ్‌లను ఆడించాలని కెర్రీ ప్యాకర్ ప్రతిపాదించినప్పుడు చాలా మంది నవ్వుకున్నారు. అతనిని హేళన చేశారు. తెల్లదుస్తులను కాదని ఆటగాళ్లు వేరే దుస్తులు వేసుకోవడం, ఐదు రోజుల మ్యాచ్‌ల స్థానంలో ఒకే రోజు రెండు ఇన్నింగ్స్ పూర్తయ్యేలా పరిమిత ఓవర్ల మ్యాచ్‌లను నిర్వహించడం అనేది ప్రారంభంలో ఎవరికీ కొరుకుడు పడలేదు. అయితే, ప్యాకర్ ఆలోచనలను, భవిష్యత్తులో చోటుచేసుకోబోయే పరిణామాలను ఐసిసి ముందుగానే పసిగట్టింది. ఆగమేఘాలపై నిర్ణయాలు తీసుకుంది. వనే్డ ఇంటర్నేషనల్ ప్రపంచకప్‌ను ప్రవేశపెట్టింది. ఆతర్వాత వనే్డ ప్రపంచకప్ ఎంతటి ప్రజాదరణ పొందిందో అందరికీ తెలిసిందే. టెస్టులను కత్తిరించి వనే్డలుగా మారిస్తే, ఇప్పుడు వనే్డలను మరింత కుదించి ట్వంటీ-20 ఫార్మెట్‌గా తీర్చిదిద్దారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టోర్నమెంట్ యావత్ క్రికెట్ రంగానే్న ఎలాంటి మార్పులకు గురి చేస్తున్నదో ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. సంప్రదాయ వాదనలకు భిన్నంగా విప్లవాత్మక మార్పులను సూచించిన ప్రతి వారినీ కొత్తల్లో పిచ్చివాళ్లుగా చూడడం, హేళన చేయడం లోక సహజం. తర్వాతి కాలంలో అవే మార్పులు సమూల మార్పులు తీసుకొచ్చి, కొత్త దిశానిర్దేశనం చేస్తాయి. ఇప్పుడు టెస్టుల్లోనూ కొత్త విధానాలను ప్రవేశపెట్టడం కొంతమంది సంప్రదాయవాదులకు రుచించకపోవచ్చు. కానీ, సంప్రదాయం పేరుతో టెస్టు క్రికెట్‌ను హతమార్చేబంతులు, కొత్త విధానాల ఊపిరిపోసి బతికించుకోవడం మంచిదే.