ఐడియా

పొగాకు రహిత కేరళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికలు వచ్చాయంటే విభిన్న రకాల నినాదాలు, డిమాండ్లు పార్టీల ముందుకు వస్తుంటాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్రంలో వైద్య నిపుణులు సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చారు. క్యాన్సర్, రక్తపోటు, మధుమేహం తదితర వ్యాధులకు కారణమవుతున్న పొగాకు ఉత్పత్తులపై పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తామని తమ ఎన్నికల మ్యానిఫేస్టోలో చేర్చాల్సిందిగా వైద్య నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. కేరళలో దాదాపు 40 శాతం మంది క్యాన్సర్ బారిన పడటానికి పొగాకు ఉత్పత్తులే కారణమని ఇటీవల జరిగిన సర్వేల్లో వెల్లడైంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఈ పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధించాలంటే పార్టీలు జంకుతున్నాయి. ఎందుకంటే వీటి వల్ల రాష్ట్రానికి 1,514 కోట్ల రూపాయల ఆదాయం వస్తుండగా, పన్నుల రూపేణా రూ. 315 కోట్లు వస్తున్నాయి. ఇంత మొత్తంలో ఆదాయ వనరులు సమకూరస్తున్న పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధిస్తామని స్పష్టమైన హామీ ఇస్తాయంటారా..? వేచి చూడాలి.