యువ

లైట్ ఎల్16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆల్ ఇన్ వన్ కెమెరా
పాయింట్ అండ్ షూట్ కెమెరాలకు కాలం చెల్లిపోయింది. ఆ పుణ్యం కట్టుకున్నది స్మార్ట్ఫోనే్ల. దీంతో కెమెరాలు మనుగడ సాగించాలంటే కొత్త పుంతలు తొక్కాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందులోభాగంగానే మార్కెట్లోకి వస్తున్న లైట్ ఎల్16 అనే కెమెరాలో అద్భుతమైన ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. ఒకే దాంట్లో 16 కెమెరాలు ఉంటాయట. ఒక ఇమేజ్ తీయాలంటే ఈ కెమెరా ఒకేసారి 10 లెన్సులను ఉపయోగిస్తుందట. ఈ షాట్స్ అన్నింటినీ కలిపి హై క్వాలిటీ ఫో టోను ఆవిష్కరిస్తుందట. ఇలాంటి ఫీచర్లున్న కెమెరా ఇప్పటివరకూ లేదంటున్నారు నిపుణులు.

అతి పెద్ద హార్డ్ డ్రైవ్!
శామ్‌సంగ్ 16టిబి ఎస్‌ఎస్‌డి
ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రశ్రేణి కంపెనీగా దూసుకుపోతున్న శామ్‌సంగ్ మరో సరికొత్త ఆవిష్కరణ- 16టిబి ఎస్‌ఎస్‌డి. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద హార్డ్ డ్రైవ్‌గా ఇప్పటికే విమర్శకుల ప్రశంసలందుకుంటోంది. ఇందులో 16టెరాబైట్ల డేటాను నిక్షిప్తం చేసుకునే వీలుంటుంది. వచ్చే ఏడాది మార్కెట్లోకి రానున్న ఈ హార్డ్ డ్రైవ్ ఖరీదు ఏడు వేల డాలర్లు ఉంటుందని అంచనా.

శామ్‌సంగ్ వైర్‌లెస్
చార్జింగ్ ప్యాడ్
వైర్‌లెస్ చార్జింగ్ ప్యాడ్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రఖ్యాత శామ్‌సంగ్ కంపెనీ కూడా ఇలాంటి చార్జింగ్ ప్యాడ్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. గాలెక్సీ రేంజ్ స్మార్ట్ ఫోన్లకోసం ఉద్దేశించిన ఈ చార్జింగ్ ప్యాడ్ ఉంటే ఇక వైర్లతో పని లేనట్టే. 375 అంగుళాల వ్యాసార్థంతో, గుండ్రంగా ఉండే ఈ చార్జింగ్ ప్యాడ్ దగ్గర ఫోన్‌ను పెడితే ఆటోమేటిగ్గా చార్జ్ అయిపోతుంది. ప్యాడ్‌కు ఉన్న ఎల్‌ఇడి లైట్ వెలిగితే చార్జింగ్ పూర్తయినట్టు అర్థం. చార్జ్ అవుతున్నప్పుడు కూడా ఫోన్‌లో మాట్లాడుకోవచ్చు.