అంతర్జాతీయం

అమెరికాలో మోదీ, షరీఫ్ భేటీ ఉండొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖట్మండు:అమెరికాలో త్వరలో జరిగే అణుసమీక్షా సమావేశానికి హాజరైన సందర్భంగా పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, భారత ప్రధాని నరేంద్రమోదీల భేటీ జరిగే అవకాశం ఉందని పాకిస్తాన్ ప్రధాని సలహాదారు సర్తాజ్ అజీజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. నేపాల్‌లోని పోఖ్రాలో భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, సర్తాజ్ అజీజ్‌తో భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదుల దాడి అనంతరం ఇరు దేశాలమధ్య ఈ స్థాయిలో భేటీ అవడం ఇదే ప్రధమం. కాగా పఠాన్‌కోట్ ఉదంతంపై పాకిస్తాన్ జాయింట్ ఇనె్వస్టిగేషన్ టీం మార్చి 27న భారత్‌కు వస్తుందని, 28నుంచి దర్యాప్తు ప్రారంభిస్తుందని ఈ సందర్భంగా అజీజ్, సుష్మా సంయుక్తసమావేశంలో సర్తాజ్ ప్రకటించారు. కాగా పాకిస్తాన్‌లో జరిగే సార్క్ సమావేశానికి రావల్సిందిగా మోదీని ఆహ్వానిస్తూ ఆహ్వానపత్రికను సుష్మాకు ఆయన అందజేశారు.