ఆంధ్రప్రదేశ్‌

పోలవరం ప్రాజెక్టుపై కార్యాచరణ : చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే క్రమంలో ఇకపై ప్రతి సోమవారాన్ని ‘పోలవారం’గా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళిని అనుసంధానం చేస్తామన్నారు. అపెక్స్‌ కౌన్సిల్‌లో సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని స్పష్టం చేశారు. గోదావరి ద్వారా 50వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమకు తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. విజయదశమి రోజున సచివాలయంలోని తన ఛాంబర్‌లోకి ప్రవేశించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.