రాష్ట్రీయం

వామపక్ష తీవ్రవాదంపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోం శాఖ సలహాదారు విజయ్‌కుమార్ పిలుపు
ముగిసిన జాతీయ భద్రతా దళాల శిక్షణ శిబిరం
హైదరాబాద్, డిసెంబర్ 12: శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వామపక్ష తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని కేంద్ర హోంశాఖ వ్యవహారాల సలహాదారు కె విజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. శనివారం హిమాయత్‌సాగర్‌లోని ఆర్‌బివిఆర్‌ఆర్ తెలంగాణ పోలీసు అకాడమిలో ‘వామపక్ష తీవ్రవాదం’పై శిక్షణ సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన విజయ్‌కుమార్ మాట్లాడుతూ భద్రతా దళాలు పేలుళ్ల సంఘటనలపై ప్రధానంగా దృష్టి సారించాలని, ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం విస్తరిస్తోందని, వామపక్ష తీవ్రవాదంతోపాటు ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు భద్రతా దళాలు ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలని సూచించారు. మావోయిస్టుల ఏరివేతకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేపడుతున్న చర్యలను ఆయన ప్రశంసించారు. తీవ్రవాదం అణచివేతపై పోలీసులకు ఇస్తున్న శిక్షణ ఎంతో బాగుందని, జిల్లాల్లోని గ్రేహౌండ్స్, ఎస్‌ఐబి దళాలు కూడా శిక్షణ పొందడం ముదావహమన్నారు. ఈ శిక్షణలో కేరళకు చెందిన ఐజిపి స్థాయి అదనపు ఎస్పీలు, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఉత్తరఖండ్ రాష్ట్రాలకు చెందిన కమాడెంట్లు, డిప్యూటీ కమాండెంట్లు పాల్గొన్నారు. సదస్సులో వామపక్ష తీవ్రవాదంతోపాటు తిరుగుబాటు సంస్థల కార్యకలాపాలు, నక్సలైట్ల ఆలోచనలు, రాష్ట్రాల స్పందన, మానవహక్కుల సంఘాలపై ప్రభుత్వ స్పందన, పోలీసు స్టేషన్ల భద్రత, తీవ్రవాద కేసులపై దర్యాప్తులు వంటి అంశాలపై చర్చించారు. తీవ్రవాద కేసుల దర్యాప్తు, ఫోరెన్సిక్ సాక్ష్యాధారాల సేకరణపై అపార అనుభవం గడించిన అరుణ్ బోత్రా సదస్సులో తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. నక్సలైట్ల రిక్రూట్‌మెంట్, నిధులు సమకూర్చుకోవడం, ఆయుధాల కొనుగోలు వంటి అంశాలపై న్యూఢిల్లీకి చెందిన ఐపిఎస్ అధికారి పివి రమణ చర్చించారు. సీనియర్ అధికారులు బి శివధర్‌రెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్, ఎంఎం భగవత్, విసి సజ్జన్నార్, షానవాజ్ ఖాసీం, ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులు వివిధ అంశాలపై చర్చించారు. (చిత్రం) పోలీసు అకాడమిలో ‘వామపక్ష తీవ్రవాదం’పై జరిగిన శిక్షణసదస్సులో ప్రసంగిస్తున్న కేంద్ర హోంశాఖ సలహాదారు కె విజయ్‌కుమార్