తెలంగాణ

పోలీసుల తీరుపై లగడపాటి ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పోలీసుల తీరుపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం రాత్రి పది గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడు నెం 65లో ఉంటున్న లగడపాటి స్నేహితుడు, ప్రముఖ వ్యాపారవేత్త జీపీ రెడ్డి నివాసానికి వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు వచ్చారు. విషయం తెలుసుకున్న లగడపాటి అక్కడకు చేరుకుని ఏ ఆధారాలతో వచ్చారని పోలీసులను నిలదీశారు. తన స్నేహితుడు ఇదే ఇంట్లో నాలుగేళ్ల నుంచి ఉంటున్నారని, పోలీసులకు తనిఖీలు చేసే అధికారం ఉండవచ్చునేమోకానీ అరెస్టు చేసే అధికారం లేదని అన్నారు. ఈ విషయాన్ని గవర్నర్, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళతానని అన్నారు.