ఆంధ్రప్రదేశ్‌

పోలీసు 30యాక్టు పేరుతో వేధింపులు:చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తణుకు: పోలీసు 30యాక్టు పేరుతో కేసులు పెడుతూ టీడీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఆయన తణుకులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌పై 12 కేసులు పెట్టారని విమర్శించారు. ఈ కేసులపై ఎస్పీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఉన్నది కేసులు పెట్టడానికి కాదనని ఉన్న కేసులను విచారించటానికి అని అన్నారు. తణుకులో తన కాన్వాయ్‌కి అనుమతి ఇవ్వలేదని, కావాలనే ఇబ్బందులకు గురిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ మెప్పు కోసం తమ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తూ వారిని పార్టీకి దూరం చేస్తున్నారని విమర్శించారు.