జాతీయ వార్తలు

కన్నయ్యకుమార్‌కు 14రోజుల కస్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:జెఎన్‌యులో జాతివ్యతిరేక చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్టయిన విద్యార్థిసంఘం నాయకుడు కన్నయ్యకుమార్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా పాటియాలా కోర్టువద్దకు బుధవారం వచ్చిన కన్నయ్యకుమార్‌పై కొందరు న్యాయవాదులు దాడిచేశారు. మరోవైపు కన్నయ్య, జర్నలిస్టులపై మొదటిసారి దాడికి సంబంధించిన కేసు విచారణ జరుగుతుండగా ఒక న్యాయవాది ‘వందేమాతరం’ అంటూ నినాదాలు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. విచారణకు భంగం కలిగిస్తూ ఇలా ప్రవర్తించడాన్ని సీరియస్‌గా తీసుకుంది. కాగా ఆ నినాదాలు చేసిన న్యాయవాది బేషరతుగా రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పడంతో శాంతించింది.