తెలంగాణ

ఎస్‌ఐ పోస్టులకు భారీ క్యూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

539 ఉద్యోగాలకు 2 లక్షల దరఖాస్తులు పోటీలో ఎంటెక్, పిహెచ్‌డిలు సైతం..
ఏప్రిల్ 17న రాత పరీక్ష ప్రకటించిన టిఎస్‌ఎల్‌పిఆర్‌బి
హైదరాబాద్, మార్చి 11: ఎస్‌ఐ ఉద్యోగాల కోసం ఇప్పుడు పిహెచ్‌డిలు సైతం పోటీపడుతున్నారు. తెలంగాణ రాష్టస్థ్రాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (టిఎస్‌ఎల్‌పిఆర్‌బి) తాజాగా ప్రకటించిన 539 పోస్టులకు 2,01,294 మంది దరఖాస్తు చేశారంటే పోటీ ఏ స్థాయలో ఉందో అంచనా వేసుకోవచ్చు. ఒక్కో పోస్టుకి దాదాపు 377 మంది పోటీపడటాన్ని చూస్తుంటే ఎస్‌ఐ పోస్టులకున్న డిమాండ్ స్పష్టమవుతోంది. టిఎస్‌ఎల్‌పిఆర్‌బి ఇటీవల ప్రకటించిన 510 సివిల్ ఎస్‌ఐ, 29 కమ్యూనికేషన్, పిటివో ఎస్‌ఐ పోస్టులు కలిపి మొత్తం 539 పోస్టులకు 2,01,294 మంది దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసిన వారిలో ఇంటర్, డిగ్రీ విద్యార్హతలున్న వారే కాదు, ఎంఫిల్, పిహెచ్‌డి, ఎంటెక్ అర్హతలున్న వారు సైతం దరఖాస్తు చేయడం గమనార్హం. పిహెచ్‌డిలు 23, ఎంఫిల్ 41, ఎంటెక్ 3658, ఎంబిఏ అర్హతతో 12,674, బిటెక్ అర్హతతో 42,492 మంది ఎస్‌ఐ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారు. వీరితోపాటు బిఏ, బికాం, బిఎస్సీ, ఇంటర్ అర్హతలున్న వారు కలిపి లక్షల్లో దరఖాస్తులు అందాయ. కమ్యూనికేషన్, పిటివో విభాగంలో ఎస్‌ఐ పోస్టులకు సైతం ఉన్నతస్థాయ విద్యార్హతలతో అభ్యర్థులు దరఖాస్తులు చేయడం గమనార్హం. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈనెల 10 రాత్రితో ముగిసింది. దీంతో ఎంతమంది దరఖాస్తు చేశారన్న వివరాలను బోర్డు చైర్మన్ జె.పూర్ణచంద్రరావు శుక్రవారం వెల్లడించారు. ఎస్‌ఐ సివిల్ ఉద్యోగాలకు మహిళలు 23,656, పురుషులు 1,62,648 మంది, ఎస్‌ఐ టెక్నికల్ పోస్టులకు మహిళలు 1,641 మంది, పురుషులు 13,313 మంది దరఖాస్తు చేశారు. వీరంతా హాల్‌టిక్కెట్లను పరీక్ష రోజుకి వారంముందు టిఎస్‌ఎల్‌పిఆర్‌బి అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆన్‌లైన్ దరఖాస్తు విధానంలో ఎవరైనా తమ దరఖాస్తును ఫోటో, సంతకం లేకుండా పంపించివుంటే సరి చేసుకునేందుకు బోర్డు అవకాశం కల్పించింది. ఈనెల 16 నుంచి 21 వరకు ఫోటో, సంతకంతో తిరిగి అప్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. ఈ రెండింటికి మాత్రమే అవకాశం ఉంటుందని, అలాంటి దరఖాస్తులను సపోర్ట్‌ఎస్‌ఐ ఎట్ టిఎస్‌ఎల్‌పిఆర్‌బి.ఇన్ కు మెయిల్ చేయాలని బోర్డు చైర్మన్ స్పష్టం చేశారు. అనంతరం ఆ అభ్యర్థి దరఖాస్తులో నమోదు చేసుకున్న మొబైల్ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్ ఐడికి అప్‌లోడ్ లింక్ ఒకటి వస్తుంది. ఆ లింక్ ద్వారా ఫోటోగ్రాఫ్, సంతకం రీలోడ్ చేసుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. ఇలా రీ అప్‌లోడ్ చేసుకున్న అభ్యర్థులు పరీక్ష సమయంలో తమవెంట ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఒరిజినల్ గుర్తింపు కార్డు ఏదోకటి తీసుకురావాల్సి ఉంటుంది. కాగా దరఖాస్తులో మిగిలిన పుట్టిన తేదీ, పేరు, స్పెషల్ కేటగిరి వంటి వాటిలో ఏమైనా మార్పులుంటే అలాగే ఉంచాలని, ప్రాథమిక రాతపరీక్షను అటువంటి వారు నిరభ్యంతరంగా రాయవచ్చని తెలిపింది. పరీక్ష పూరె్తైన తర్వాత అర్హత సాధించిన వారికి దరఖాస్తులో మార్పులు, చేర్పులకు మరో అవకాశం ఇస్తున్నట్లు సమాచారాన్ని తెలిపారు. రాత పరీక్ష ఏప్రిల్ 17న అన్ని జిల్లా కేంద్రాలు, ఎంపిక చేసిన కొన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చైర్మన్ వెల్లడించారు.