తెలంగాణ

పోలియో వైరస్‌పై ఆందోళన వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: హైదరాబాద్‌ అంబర్‌పేటలో బయటపడిన పోలియో వైరస్‌ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి జగత్‌ ప్రకాశ్‌నడ్డా తెలిపారు. అంబర్‌పేటలో పోలియో వైరస్‌ గుర్తించడంలో నిఘా వ్యవస్థ బాగా పనిచేసిందని మంత్రి ప్రశంసించారు. పోలియో నివారణ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్‌ వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి కేంద్రం పనిచేస్తుందని ఆయన తెలిపారు.
ప్రస్తుతం కొనసాగుతున్న పోలియో నివారణ కార్యక్రమం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే 2లక్షల మందికి పైగా చిన్నారులకు పోలియో వ్యాక్సిన్‌ వేసినట్లు చెప్పారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి కేంద్ర మంత్రి నడ్డా అంబర్‌పేటలో పోలియో వ్యాక్సిన్‌ కేంద్రాన్ని సందర్శించారు.