మహబూబ్‌నగర్

పాలమూరులో వేడెక్కిన రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* తెరాస, కాంగ్రెస్‌లో పెరిగిన పోటీ
* స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టిక్కెట్ల రేసులో ఉద్ధండులు
* లాబీయింగ్‌లు షురూ...క్యాంపు రాజకీయాలకు శ్రీకారం
మహబూబ్‌నగర్, నవంబర్ 27: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ జారీ కావడంతో పాలమూరు జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇటీవల వెలువడిన వరంగల్ ఉప ఎన్నికల ఫలితాలపైనే దృష్టి సారించి ఆ ఫలితాలపై విశే్లషించుకుంటున్న నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నగారా మోగించింది. దీంతో రాజకీయ పార్టీల నేతల దృష్టి అంతా ఒక్కసారిగా ఎమ్మెల్సీ ఎన్నికల వైపు మళ్లింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల టిక్కెట్ల కోసం అడపాదడపా కొందరు నాయకులు తమ ప్రయత్నాలను చేసుకుంటూ వచ్చారు. అయితే ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేసపథ్యంలో ఒక్కసారిగా ఆశవహుల సంఖ్య అమాంతంగా పెరిగిపోయింది. అధికార టిఆర్‌ఎస్ పార్టీలో ఆశావహుల సంఖ్య అర డజనుకుపైగా చేరింది. అదేవిధంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో కూడా అరడజను మంది నాయకులు రెండు ఎమ్మెల్సీ టిక్కెట్ల కోసం పోటీ పడుతున్నారు. టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌లో రాజకీయాల్లో ఉద్దండులుగా పేరొందిన ప్రముఖ నేతలే టిక్కెట్లను ఆశిస్తుండడంతో చోటామోటా నాయకులు గందరగోళానికి గురవుతున్నారు. అందులో భాగంగా టిఆర్‌ఎస్‌లో ఒక స్థానాన్ని ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డికి ఖరారు అయినట్లు ఆ పార్టీ ముఖ్యనేతలే బహిరంగంగానే చెబుతున్నారు. మరో స్థానానికి మాజీ ఎంపి జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు, తెరాసనేతలు శంకర్, దేవర్ మల్లప్ప, శ్రీనివాస్‌యాదవ్, కసిరెడ్డి నారాయణరెడ్డి, విఠల్‌రావు ఆర్యాతో పాటు మరో ఇద్దరు నేతలు టిక్కెట్లను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్‌లో కూడా మాజీ జడ్పీ చైర్మన్ కుచుకుళ్ల దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లురవి, మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బుర్రి వెంకటరామరెడ్డి, శ్రీనివాసగుప్త, జూపల్లి భాస్కర్‌రావుతో పాటు మరో ఇద్దరు నాయకులు ఎమ్మెల్సీ టిక్కెట్ల కోసం లాబీయింగ్ మొదలుపెట్టినట్లు సమాచారం. టిడిపి, బిజెపిల ఉమ్మడి అభ్యర్థి ఉంటారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. టిడిపి తరపున ఒక స్థానానికి మాత్రం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డిని రంగంలోకి దింపేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లాలో మూడు దశాబ్దాల తరువాత రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 1982లో చివరిసారిగా రెండు స్థానాలకు ఎన్నికలు జరిగింది. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓటర్లు మొత్తం 1259 మంది ఉన్నారు. టిక్కెట్ల రేసులో జిల్లాకు సంబంధించిన రాజకీయ ఉద్దండులు రేసులో ఉండడంతో ఆయా పార్టీల అధిష్టానానికి జిల్లాలో ఎమ్మెల్సీ టిక్కెట్ల వ్యవహారం కొంత తలనొప్పిగా మారే విధంగా కనబడుతోందని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. ఇంకా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాకముందే ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మాత్రం వేడెక్కిందని చెప్పవచ్చు. టిక్కెట్ల కోసం ముమ్మర ప్రయత్నం చేస్తున్న నాయకులు అప్పుడే క్యాంప్ రాజకీయాలకు శ్రీకారం చుట్టారు.

సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం

పురోగతిపై సమీక్ష సమావేశంలో కలెక్టర్
మహబూబ్‌నగర్, నవంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఈ విషయాన్ని జిల్లా అధికారులంతా గుర్తుంచుకోవాలని జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి వెల్లడించారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని రెవెన్యూ మీటింగ్‌హాల్‌లో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూ సేకరణ అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి మాట్లాడుతూ అధికారులు బాధ్యతాయుతంగా పని చేసి సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అధికారులు ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని తెలిపారు. పునరావాస కేంద్రాలలో అన్ని వౌళిక వసతులు కల్పించాలని తెలిపారు. నిర్వాసితులకు చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని పారధర్శకంగా అందించాలని అన్నారు. జిల్లాలోని ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల పనులపై ఎప్పటికప్పుడు వాటి పురోగతిపై సమాచారం ఇవ్వడమే కాకుండా సంబంధిత శాఖలకు పూర్తి సమాచారం అందించాలని ఎక్కడేనా ఇబ్బదులు తలెత్తితే వాటి పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. వచ్చే ఏడాది ప్రస్తుతం కన్నా అధికంగా అధనపు ఆయకట్టుకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులు పూర్తి అయితే దాదాపు ఆరు నుండి ఎనిమిది లక్షల ఎకరాలను అధనపు ఆయకట్టు సాగులోకి వస్తుందని జిల్లా రైతాంగానికి సాగునీరు వస్తే వారి జివితాల్లో ఆనందాలు వెల్లువిరుస్తాయని కలెక్టర్ తెలిపారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించే విషయంలో అధికారుల పాత్ర చాల కీలకమని అన్నారు. గ్రామ సభలను అధికారులు ఖచ్చితంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. గ్రామ సభల తీర్మాణాలతోనే కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి సమర్పించాలని ఆదేశించారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణ సత్వరమే పూర్తి చేయాలని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే తెలంగాణలోని సగం జిల్లాల రైతులు అభివృద్ధి చెందుతారని కలెక్టర్ అన్నారు. అధికారులు ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణపై ప్రత్యేక దృష్టి చేపట్టాలని ఇప్పటికే నార్లపూర్, ఏదుల, కర్వేనా, వట్టెం రిజర్వాయర్లకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుందని అన్నారు. నిర్వాసితులకు అందించాల్సిన నష్టపరిహారం చెల్లింపు ప్రక్రియ కూడా ప్రారంభమయిందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాంకిషన్, డిఆర్‌ఓ భాస్కర్, ప్రత్యేక కలెక్టర్ వనజాదేవి, ఆర్డీఓలు, సాగునీటి ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.