రాష్ట్రీయం

మళ్లీ తెరాస జోరేనా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరు మండలి సీట్లపై ఉత్కంఠ
గెలుపుకోసం తెరాస వ్యూహం
పార్టీలో చేరికల జోరు
చేతులెత్తేసిన టిడిపి, డీలా పడ్డ కాంగ్రెస్
27న పోలింగ్

హైదరాబాద్, డిసెంబర్ 24: శాసన మండలిలో స్థానిక సంస్థల కోటా నుంచి 12 స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఆరు స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుని ఉత్సాహంగా ఉన్న టిఆర్‌ఎస్, పోటీ జరుగుతున్న ఆరు స్థానాల్లోనూ విజయం సాధించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు నియోజక వర్గాలు, రంగారెడ్డి జిల్లాలో రెండు నల్లగొండ, ఖమ్మం నియోజక వర్గాల్లో 27న పోలింగ్ జరుగుతుంది. 30న ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. పోలింగ్ జరిగే రోజు, ఓట్ల లెక్కింపు జరిగే రోజు ఆయా జిల్లాల్లో సెలవు ప్రకటించారు. తొమ్మిది జిల్లాల్లో 12 స్థానాలకు ఎన్నికలు కాగా, ఐదు జిల్లాల్లోని ఆరు స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాలుగు జిల్లాల్లో ఆరు స్థానాలకు 27న పోలింగ జరుగుతుంది. వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లోని ఆరు స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. మహబూబ్‌నగర్, రంగారెడ్డి,నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పోలింగ్ జరుగుంది. ఇప్పటికే ఆరు స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న టిఆర్‌ఎస్ నాయకత్వం పోటీ జరిగే ఆరు నియోజక వర్గాల్లోనూ గెలుపు దిశగా అడుగులేస్తోంది. ఒకవైపు పార్టీ నాయకులంతా అయుత మహాచండీ యాగంలో పాల్గొంటున్నా ఎవరికి అప్పగించిన బాధ్యతలు వారు నెరవేరుస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు స్థానాల్లో ఒక స్థానంలో పోటీ ఉంటుందని, మిగిలిన ఐదు స్థానాల్లో గెలుపు మాదే టిఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని టిడిపి సభ్యులు తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలని టిఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. బహిరంగంగా కాంగ్రెస్‌కు టిడిపి మద్దతు ప్రకటించే అవకాశాలు ఉన్నాయా? అని చూస్తున్నారు. ఒకవేళ అలా ఆదేశించినా టిడిపి సభ్యులు పాటిస్తారని లేదని, వాళ్లకు నచ్చిన విధంగా ఓటు వేస్తారని అదే నమ్మకంతో మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండవ స్థానం సైతం కైవసం చేసుకుంటామనే ధీమాను టిఆర్‌ఎస్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.
చిత్రంగా ఖమ్మం...
ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నవి స్థానిక సంస్థల కోటాలో మండలి ఎన్నికలు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు వేస్తారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఖమ్మంలో టిఆర్‌ఎస్ అసలు పోటీనే చేయలేదు. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఓటర్లలో టిఆర్‌ఎస్ బలమైన శక్తిగా నిలిచింది. ఇక్కడ పోటీ టిఆర్‌ఎస్, సిపిఐల మధ్యనే. అయితే మా విజయం ఖాయం అని ఆ జిల్లా టిఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వంలో జిల్లా పరిషత్తు చైర్ పర్సన్‌తో సహా పెద్ద సంఖ్యలో టిడిపి నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. స్థానిక సంస్థల నాయకులు సైతం చేరిపోయారు. దాంతో జిల్లాలో స్థానిక కోటా కింద జరిగే మండలి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ బలమైన శక్తిగా మారింది.
శాసన మండలి ఎన్నికల్లో ముందు నుంచే టిడిపి చేతులు ఎత్తేసింది. ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరిపోవడంతో పోటీ చేయలేని పరిస్థితి తలెత్తింది. చివరకు కొంత మంది అభ్యర్థులను రంగంలో నిలిపినా వారు నామినేషన్ ఉప సంహరించుకుని టిఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించారు. ఒకవైపు ఎన్నికల ప్రచారం జరుగుతుంటే మరోవైపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టిఆర్‌ఎస్‌లో చేరిపోతుండడంతో కాంగ్రెస్ నాయకులు ఢిలా పడిపోయారు. ప్రారంభంలో నల్లగొండ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి హడావుడి చేసినా టిఆర్‌ఎస్ నాయకులు స్థానిక ప్రతినిధులు ఒక్కోక్కరిని పార్టీలో చేర్చుకుంటున్నారు. మరో రెండు రోజుల్లో పోలింగ్ జరుగుతుండగా, టిఆర్‌ఎస్‌లో స్థానిక ప్రతినిధుల చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి నియోజక వర్గంలోని కాంగ్రెస్ ఎంపిటిసిలు తెలంగాణ భవన్‌లో గురువారం టిఆర్‌ఎస్‌లో చేరారు. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి నాయకత్వంలో ఎంపిటీసిలు టిఆర్‌ఎస్‌లో చేరారు. ఆరులో ఐదు గ్యారంటీ, ఒక దానికి పోటీ ఉంటుంది అని టిఆర్‌ఎస్ అగ్రనాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.