ఖమ్మం

కొత్తగూడెం పోలింగ్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*226 ఓట్లకు 199 ఓట్లు నమోదు
*ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపి పొంగులేటి, ఎమ్మెల్యేలు జలగం, కోరం
కొత్తగూడెం, డిసెంబర్ 27: కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మొత్తం రెవెన్యూ డివిజన్‌లో 226 ఓట్లు ఉండగా 199ఓట్లు పోలయ్యాయి. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మొదటగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావుకూడా ఓటు వేశారు. ఎమ్మెల్యే వెంకటరావు క్యూ లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. వైకాపా మినహా మిగిలిన రాజకీయ పార్టీలు మధ్యాహ్నం పనె్నండు గంటలలోపే ఓటు హక్కును వినియోగించుకోగా వైకాపా మాత్రం రెండు గంటల తర్వాత ఓటు హక్కును వినియోగించుకుంది. కొత్తగూడెం మండలం చుంచుపల్లి-3 ఎంపిటిసి తేజావత్ ఈరి, రుద్రంపూర్ ఎంపిటిసి బూక్యా రుక్మిణిలు అనారోగ్యం కారణంగా పోలీసుల సాయంతో క్యూలో నిలబడకుండా తమ ఓటు హక్కును నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెల్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే విధంగా ఇల్లెందు మున్సిపాలిటీ 8వ వార్డు కౌన్సిలర్ సామల రాధాశ్రీ డిస్క్ సమస్యతో అనారోగ్యం కారణంగా ఆంబులెన్సులో పోలింగ్‌కేంద్రానికి వచ్చి సహాయకునితో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపల్ చైర్‌పర్సన్‌లు పులి గీత, మడత రమా కొత్తగూడెం ఎంపిపి బానోత్ కేస్లీ, జడ్‌పిటిసి గిడ్ల పరంజ్యోతిరావులతో పాటు పలు మండలాల ఎంపిపిలు, జడ్‌పిటిసిలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.