రాష్ట్రీయం

ఇక ఆన్‌లైన్‌లో ‘కాలుష్య’ పర్యవేక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 31: ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో పరిపాలనా విధానం, పర్యవేక్షణను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించేందుకు వీలుగా ‘ఆన్‌లైన్ కన్సల్టెంట్ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (ఒసిఎంఎంఎస్)ను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఈ ఆన్‌లైన్ విధానాన్ని గురువారం ప్రారంభించినట్లు ఆ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఉన్న పరిశ్రమకు సంబంధించిన దరఖాస్తులు, ప్రతిపాదనలు వంటి వాటిని సులభతరంగా పర్యవేక్షించేందుకు వీలుగా ఈ కొత్త విధానం ప్రారంభించినట్లు తెలిపింది. బోర్డు అనుమతించిన వాటి వివరాలు, కొత్తగా వచ్చే దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. దీనిలో గ్లోబల్ ఆన్‌లైన్ అప్లికేషన్ పోర్టల్, రోల్ బేస్డ్ అప్లికేషన్స్, మల్టీలెవెల్ సెక్యూరిటీ సిస్టమ్ వంటివి ఉన్నాయని తెలిపింది. సులభతరంగా పని చేసే పద్దతిని కేంద్రం వెల్లడించిందని, ఆ మేరకు ఈ ఆన్‌లైన్ వ్యవస్థను తీర్చిదిద్దినట్లు కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. ఈ కార్యక్రమంలో బల్క్‌డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్, ఫ్యాప్సి, సిఐఐ, సిమెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ వారు పాల్గొన్నారు.