రంగారెడ్డి

శతచండీయాగంలో జడ్పీ చైర్‌పర్సన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, నవంబర్ 27: మండల పరిధిలోని ఎలిమినేడులో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న శతచండీయాగం మూడవ రోజు ప్రత్యేక పూజల్లో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు పట్నం సునీతా మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌తో పాటు మాజీ ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థప్రసాదాలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ ఇబ్రహీంపట్నాన్ని అభివృద్ధి పర్చడానికి, నియోజకవర్గంలో కరువు పరిస్థితులు తొలగాలని స్థానిక ఎమ్మెల్యే శతచండీయాగం చేయడం అభినందనీయమని అన్నారు. ఎంపిపిలు మర్రి నిరంజన్‌రెడ్డి, జ్యోతినాయక్, జడ్పీటిసి రమేష్‌గౌడ్, ఐఎస్‌సదన్ మాజీ కార్పోరేటర్ మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి, నగరపంచాయతీ చైర్మన్ భరత్‌కుమార్, సిఐ జగదీశ్వర్, తెరాస నాయకులు సత్తు వెంకటరమణారెడ్డి, పరికిషన్‌రెడ్డి పాల్గొన్నారు.
బుగ్గను దర్శించుకున్న సునీతారెడ్డి
శతచండీయాగంలో పాల్గొన్న జడ్పీ చైర్‌పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి అక్కడి నుండి ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వరుని బుగ్గజాతరకు వెళ్ళారు. బుగ్గ రామలింగేశ్వరున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపిపి గుండెమోని జయమ్మ, జడ్పిటిసి మహిపాల్, ఎంపిడిఓ నాగమణి, తెరాస నాయకులు పాల్గొన్నారు.