కర్నూల్

వైభవంగా మహా పూర్ణాహుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వేలాదిగా తరలివచ్చిన భక్తులు
ఆళ్లగడ్డ, డిసెంబర్ 25: మండలంలోని అహోబిలంలో ఈ నెల 18 నుంచి జరుగుతున్న మహాయజ్ఞం వైభవంగా సాగుతోంది. జ్వాలా ట్రస్ట్ అధినేత శ్రీ్ధర్ గురూజీ ఆధ్వర్యంలో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం రాత్రి మహా పూర్ణాహుతి పూర్ణాహుతి వైభవంగా జరిగింది. ఉదయం సూర్య నమస్కారం, వేదపండితుల మంత్రోచ్ఛారణల మద్య సాలగ్రాలకు అభిషేకం చేశారు. గురూజీకి పాద పూజ కార్యక్రమాలు జరిగాయి. హోమంలో పాల్గొనేందుకు వందల దంపతులు సంకల్పం చేయించుకున్నారు. అగ్నితో అన్ని కుండములు వెలిగించి శ్రీ్ధర్ గురూజీ, తన శిశ్య బృందంతో కలిసి మం6తాలు వళ్లిస్తూ హోమ గుండంలో పపప్పుదినుసులు, పండ్లు, టెంకాయలు తదితర వస్తువులు వేసి హోమాన్ని దిగ్విజయంగా పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.